ఎన్సీబీ ముందుకు నేడు రకుల్, రేపు దీపిక..

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణానికి లింక్ ఉన్న అక్రమ మాదక ద్రవ్యాల సరఫరా కేసులో నటి రియా చక్రవర్తి అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత సెప్టెంబరు 23వ తేదీన మరో నలుగురు బాలీవుడ్ హీరోయిన్లకి ఎన్సీబీ నుండి సమన్లు జారీ అయ్యాయి. దీపికా పదుకునే, రకుల్ ప్రీత్ సింగ్, సారా ఆలీఖాన్, శ్రద్ధ కపూర్ లకి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో సమన్లు జారీ చేసింది. ఈ మేరకు ఈ నలుగురు ఎన్సీబీ ముందు హాజరు కావాల్సి ఉంటుంది.

అయితే నేడు రకుల్ ప్రీత్ సింగ్ ఎన్సీబీ ముందుకు వెళ్ళనుందట. సమన్లు జారీ అయినపుడు హైదరాబాద్ లో షూటింగ్ చేస్తున్న రకుల్, వెంటనే ముంబై వెళ్ళిపోయింది. ఈ రోజు రకుల్ ని ప్రశ్నించాక రేపు దీపికా పదుకునే ఎన్సీబీ ముందు హాజరు అవుతుందట. షూటింగ్ నిమిత్తమై గోవాలో ఉన్న దీపికా పదుకునే ముంబై వచ్చేసిందట. మాదక ద్రవ్యాల కేసులో దీపికా పేరు రాగానే అందరూ షాకయ్యారు.