దీప్తి సునైనా వచ్చేసింది.. కౌశల్ తో పెట్టుకున్నారా..!

-

స్టార్ మా ప్రతిష్టాత్మకంగా చేస్తున్న బిగ్ బాస్ మొదటి సీజన్ సక్సెస్ ఫుల్ అవగా సెకండ్ సీజన్ మొదట్లో కాస్త అంత ఆకట్టుకోలేకున్నా ఇప్పుడు అందరిని అలరిస్తుంది. ఈమధ్య ఇంటి సభ్యుల మధ్య ఊహించని సంఘటనలు చోటు చేసుకోవడం షోకి మరింత క్రేజ్ తెచ్చింది. ఇక బయట ఎలాగు కౌశల్ ఆర్మీ సపోర్ట్ ఉండనే ఉంది.

ప్రతి వారం లానే ఈవారం కూడా ఎలిమినేషన్ జరిగింది. దీప్తి సునైనా ఈ వారం ఇంటి నుండి బయటకు వచ్చింది. అయితే లాస్ట్ వీక్ లో కాల్ సెంటర్ టాస్కులో దీప్తి కౌశల్ ను టార్గెట్ చేయడం వల్లే బయట ఉన్న కౌశల్ ఆర్మీ అతనికి సపోర్ట్ గా నిలుస్తూ దీప్తి ని బయటకు వచ్చేలా చేశారని తెలుస్తుంది. కేవలం ఎలిమినేషన్ మాత్రమేనా దీప్తి మీద విపరీతమైన ట్రోలింగ్స్ కూడా వచ్చాయి.

బిగ్ బాస్ మొత్త కౌశల్ ఆర్మీ చేతిలోనే ఉంది అన్న భావన వస్తుంది. వారు ఎవరిని ఎలిమినేట్ చేయాలంటే వారికి నెగటివ్ గా ట్రోల్స్ చేయడం వారికి కాకుండా మిగతా వారికి సపోర్ట్ చేయడం జరుగుతుంది. భాను శ్రీ నుండి దీప్తి సునైనా వరకు కౌశల్ తో గొడవ పడితే చాలు వారికి నెక్స్ట్ ఎలిమినేషన్ ఉన్నట్టే. కౌశల్ మంచి టఫ్ ప్లేయర్ గా హౌజ్ లో అందరికి టార్గెట్ అవుతున్నా కేవలం అతనికే సపోర్ట్ చేస్తూ ఇలా చేయడం మంచిది కాదు. మరి రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version