దేవ్ రివ్యూ & రేటింగ్

-

తమిళ హీరో కార్తి, రకుల్ ప్రీత్ సింగ్ కలిసి నటించిన సినిమా దేవ్. రజత్ రవిశంకర్ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కార్తి, రకుల్ ఖాకి సినిమా తర్వాత చేసిన ఈ సినిమా ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం.

కథ :

ఎప్పుడు జీవితం అడ్వెంచరస్ గా ఉండాలన్న ఆలోచనలో ఉండే దేవ్ ఫోటోగ్రఫీ, ట్రెక్కింగ్ ఇలా చేస్తూ ఉంటాడు. అలాంటి దేవ్ కు సడెన్ గా మేఘన (రకుల్) ను చూడగానే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కలుగుతుంది. ఆమె కోసం వెంటపడతాడు. అయితే బిజినెస్ ఉమెన్ అయిన మేఘన ముందు దేవ్ ని పట్టించుకోదు ఆ తర్వాత అతని ప్రేమకు ఓకే చెప్పి అతని ఫ్రీడం ను తను తీసుకుంటుంది. అతను చేసే పనుల వల్ల అతన్ని మిస్ అవుతున్నా అని చెబుతూ దేవ్ కు దూరమైన మేఘన కోసం దేవ్ ఏం చేశాడు అన్నది సినిమా కథ.

ఎలా ఉందంటే :

ఆల్రెడీ ఖాకితో హిట్ అందుకున్న కార్తి, రకుల్ జోడి మరోసారి కలిసి నటించిన సినిమా దేవ్. ఈ సినిమాలో కూడా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగానే వర్క్ అవుట్ అయ్యింది. అయితే కథ, కథనాలు పెద్దగా ఆకట్టుకోలేదు. మొదటి భాగం పర్వాలేదు అనిపించిన దర్శకుడు సెకండ్ హాఫ్ బోర్ కొట్టించేశాడు.

ఏమాత్రం ఆకట్టుకోలేని కథ కథనాలతో దేవ్ వచ్చింది. ఇక సినిమాలో కాస్త కూస్తో మ్యూజిక్, సినిమాటోగ్రఫీ అని చెప్పొచ్చు. వేల్ రాజా సినిమాటోగ్రఫీ బాగుంది. హారీస్ జైరాజ్ మ్యూజిక్ మెప్పించాడు. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి. అయితే అసలైన సినిమాలో మ్యాటర్ లేకపోయే సరికి ఇవన్ని ఉన్నా లాభం లేకుండా పోయింది.

ఎలా చేశారు :

దేవ్ పాత్రలో కార్తి, మేఘన పాత్రలో రకుల్ ఇద్దరు మంచి నటన కనబరిచారు. ఇద్దరి మధ్య లవ్ సీన్స్ వారు బాగానే చేసినా దర్శకుడు అది కూడా నాటెకీయంగా అనిపించేలా రాసుకున్నాడు. ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ లాంటి స్టార్స్ ఉన్నా వారికి తగిన పాత్రలు ఇవ్వకుండా చిన్న పాత్రలకే పరిమితం చేశాడు. ఇక మిగతా పాత్రలన్ని పరిధి మేరకు నటించి మెప్పించారు.

ప్లస్ పాయింట్స్ :

కార్తి, రకుల్

మ్యూజిక్

సినిమాటోగ్రఫీ

ప్రొడక్షన్ వాల్యూస్

మైనస్ పాయింట్స్ :

రొటీన్ స్టోరీ

స్క్రీన్ ప్లే

బాటం లైన్ : దేవ్.. ఆకట్టుకోలేని ప్రయత్నం..!

రేటింగ్ : 2.5/5

Read more RELATED
Recommended to you

Latest news