ఆమె కారణంగా బాలకృష్ణలో ఇంత మార్పు వచ్చిందా..?

-

కరోనా తర్వాత మళ్ళీ ఫామ్ లోకి వచ్చిన హీరోలలో నందమూరి బాలకృష్ణ కూడా ఒకరు. ఇక ఎన్టీఆర్ కథానాయకుడు , ఎన్టీఆర్ మహానాయకుడు, రూలర్ వంటి సినిమాలతో హ్యాట్రిక్ ఫ్లాపులతో డీలాపడ్డ బాలకృష్ణ.. తాజాగా వచ్చిన అఖండ సినిమాతో అఖండమైన విజయాన్ని బాక్సాఫీస్ దగ్గర సొంతం చేసుకోవడమే కాకుండా ఈ సినిమా ఇప్పటికీ కలెక్షన్ల సునామీ సృష్టిస్తూ ఉండడం గమనార్హం. ఇక ఈ సినిమా విడుదలై 175 రోజులకు పైగా అవుతున్నప్పటికీ మంచి కలెక్షన్లు రాబడుతూ ఇండస్ట్రీ రికార్డులను చెరిపేస్తోంది ఈ సినిమా. అలాగే బాలయ్య బాబు ఓటీటీలో సక్సెస్ ఫుల్ గా ఎంట్రీ కూడా ఇచ్చారు. ఇక తెలుగు ఓ టీ టీ ఫ్లాట్ ఫార్మ్ అయినటువంటి ఆహా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఇందులో బాలయ్య చేసిన అన్ స్టాపబుల్ షో గురించి అయితే మరి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.Balakrishna Daughter Wedding | Tejaswini Marriage Invitation | Nandamuri Family Fans - Filmibeat

ఇక డిజిటల్ ఫేస్ లో తొలిసారి వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ సీనియర్ హీరో తనదైన శైలిలో సోనీ నడిపించి అత్యధిక వ్యూస్ రాబట్టి మంచి రికార్డు సృష్టించాడు. ఇకపోతే ఈ కార్యక్రమం బాలకృష్ణ మీద నెగిటివిటీ చాలావరకు తగ్గించడమే కాదు ఆయనలో ఉన్న మరో కోణాన్ని కూడా ఆవిష్కరిస్తూ మరింత మంది ప్రేక్షకులకు చేరువ అయ్యేలా చేసింది. ఇకపోతే బాలయ్య షో ఇంత సక్సెస్ఫుల్ గా రాణించడం వెనుక ఆయన చిన్న కూతురు తేజస్విని ఉంది అని నందమూరి అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక బాలయ్యను కొత్తగా చూపించడానికి తేజస్విని చాలా రిస్క్ చేశారట. ఇక ఆహా టీమ్ తో కలిసి తన తండ్రి లుక్ అలాగే కాస్ట్యూమ్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది.Nandamuri Tejaswini Personal Photos - Lovely Teluguఇదే క్రమంలో బాలకృష్ణ క్రియేటివ్ నిర్ణయాలు తీసుకోవడం వల్లే.. ఎంపికలో తేజస్విని కూడా పాలుపంచుకుంది అని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఇక మొత్తానికి అయితే తేజస్విని వల్లే ఇంత సక్సెస్ ను సొంతం చేసుకున్నాడు బాలయ్య. ప్రస్తుతం గోపీచంద్ మలినేని అలాగే అనిల్ రావిపూడి లాంటి స్టార్ డైరెక్టర్లతో అద్భుతమైన ప్రాజెక్టులను లైన్ లో పెట్టారు బాలయ్య.

Read more RELATED
Recommended to you

Latest news