తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమెడియన్ గా పేరుపొందాడు విశ్వనాథ శాస్త్రి . అయితే ఈ పేరు చెబితే ఎవరు కనుక్కో లేకపోవచ్చు కానీ ఐరన్ లెగ్ శాస్త్రి అంటే మాత్రం ప్రతి ఒక్కరు గుర్తుపడతారు. ఎందుచేతనంటే ఈ నటుడు పండించిన నటన అలాంటిది అని చెప్పవచ్చు. ఈయన వృత్తిపరంగా పురోహితుడు. ఈ వీ వీ సత్యనారాయణ ద్వారా ఆయన తొలిసారిగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. మొదటి చిత్రం అప్పుల అప్పారావు అనే సినిమాతో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టాడు ఐరన్ లెగ్ శాస్త్రి.
ఈయన నటించే ప్రతి సినిమాలో కూడా ఆయన కోసం ఒక ప్రత్యేకమైన పాత్రని సృష్టించే వారు అదే ఐరన్ లెగ్ శాస్త్రి పాత్ర. ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టక ముందు వరకూ ఆయన పేరు.. గనుపూడి విశ్వనాథశాస్త్రి.. ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఈయన పేరు ఐరన్ లెగ్ శాస్త్రి గా మారిపోయింది. ఈయన నిజజీవితంలో కూడా ఈయన పురోహితుడు కావడంతో ఆయనకు ఎక్కువగా పురోహితుడి పాత్రలే ఎక్కువగా వచ్చేవి.. అంటే దాదాపుగా ఇప్పటివరకు 165 కు పైగా సినిమాలో నటించాడు.
అందుకు కారణం ఆయన నటన పరంగా సినిమాలలో నటించిన పాత్రలు నిజజీవితంలో కూడా నిజమయ్యాయి. దీంతో అటు పురోహితం దొరకక సంపాదన లేక చాలా కృంగిపోయి ఉండేవారట. ఇక అలా బరువు కూడా ఎక్కువగా ఉండటంతో పలు అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయి. చివరికి గుండె జబ్బు కారణంగా కామెర్ల వ్యాధితో మరణించారు. ఐరన్ లెగ్ శాస్త్రి సేవన్ గా రిక్షా లో ఉండడంతో ఆయన కుటుంబ సభ్యులు చూసి చాలా కుంగిపోయారు. ఆయన భార్య, కొడుకు.. ఐరన్ లెగ్ శాస్త్రి మరణించిన తర్వాత ఎన్నో కష్టాలు పడ్డామని కొడుకు ప్రసాద్ తెలియజేశాడు.