ఒకే రోజు మూడు డిజాస్టర్ సినిమాలు విడుదల అయ్యాయి !

అమెజాన్ ప్రైమ్ మరియు నెట్‌ఫ్లిక్స్ వంటి వాటిల్లో ఇటీవల టాలీవుడ్ ఇండస్ట్రీలో విడుదలైన కొత్త కొత్త సినిమాలు తక్కువ రోజుల్లోనే అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్ వంటి వాటిల్లో విడుదల అవుతున్నాయి. సినిమా నిర్మాతలు తాము నిర్మించిన సినిమా ఏ మాత్రం ప్రేక్షక ఆదరణ పొందక పోతే మాత్రం సదరు సినిమా మార్కెట్లోకి అతి తక్కువ సమయంలోనే డిజిటల్ హక్కుల రూపంలో సినిమాని అమ్మేస్తున్నారు.

చిన్నా పెద్ద అనే తేడా లేకుండా ఇట్లాంటి అమెజాన్, నెట్‌ఫ్లిక్స్ వంటి వాటిల్లో సినిమాలు రిలీజ్ అవుతుండటంతో నెటిజన్లు కూడా వీటిలో సినిమాలు చూడటానికి భారీగానే డబ్బులు ఖర్చు పెడుతున్నారు. 3 డిజాస్టర్ సినిమాలు ఇటీవల విడుదలయ్యాయి.

 

అవి ఏమిటంటే జబర్దస్త్ కామెడీ షో ద్వారా పాపులారిటీ సంపాదించిన సుడిగాలి సుదీర్ మొట్టమొదటిసారి హీరోగా నటించిన ‘సాఫ్ట్‌వేర్ సుధీర్’, ఆర్ఎక్స్ 100 సినిమా తో మంచి క్రేజీ సంపాదించిన హీరో కార్తికేయ నటించిన ’90 ఎంఎల్’ మరియు శ్రీనివాసరెడ్డి నటించిన ‘భాగ్యనగర వీధుల్లో’ ఈ మూడు సినిమాలు ఇటీవల ఒకే రోజు అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల చేశారు. వీటన్నిటిలో కార్తికేయ సినిమా కి మంచి రేటు పలికినట్లు సమాచారం.