రవితేజ టార్గెట్ గా ఆర్ఎక్స్100 దర్శకుడు అజయ్ భూపతి ట్వీట్‌

-

ప్రస్తుతం టాలీవుడ్ లో ఓ ట్వీట్ వైరల్ అవుతోంది. ఆర్ఎక్స్ 100 సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయిన అజ‌య్ భూప‌తి త‌న నెక్ట్స్ సినిమా కోసం ఓ క‌థ రెడీ చేసుకున్నాడు. ఈ క‌థ‌కు మ‌హాస‌ముద్రం అనే టైటిల్ కూడా పెట్టుకున్నాడు. ఈ సినిమా క‌థ విష‌యంలో ఓ హీరోతో గ్యాప్ రావ‌డంతోనే అజ‌య్ ఆ హీరో టార్గెట్‌గా ఈ ట్వీట్ చేసిన‌ట్టు గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

Director ajay bhupathi cheap star tweet goes viral
Director ajay bhupathi cheap star tweet goes viral

కేవలం చీప్ స్టార్ అంటూ ఓ పదం మాత్రం ట్వీట్ చేశారు. అంత‌కు మించి ఎలాంటి సంకేతాలు ఇవ్వ‌లేదు. దీంతో ఆ హీరో ఎవ‌ర‌న్న‌దానిపై ఇండ‌స్ట్రీలో గుస‌గుస‌లు న‌డుస్తున్నాయి. మ‌హాస‌ముద్రం క‌థ‌ను ముందుగా నాగచైతన్యతో చేద్దామని ప్లాన్ చేసినప్పటికీ వర్కవుట్ కాలేదు. రెండో ప్ర‌య‌త్నంలో భాగంగా ర‌వితేజ‌ను అప్రోచ్ అయ్యారు. ఓకే అన్న‌ట్టుగా వార్త‌లు వ‌చ్చాయి.

రీజ‌న్ ఏంటో తెలియ‌దు గాని ర‌వితేజ ఈ ప్రాజెక్టును ప‌క్క‌న పెట్టాడ‌ట‌. ఆ కోపంతోనే అజ‌య్ ర‌వితేజ‌ను టార్గెట్‌గా చేసుకుని చీప్‌స్టార్ అన్న‌ట్టుగా టాక్‌. గ‌తేడాది మూడు వ‌రుస ప్లాపులు వ‌చ్చినా కూడా ర‌వితేజ త‌న రేటు విష‌యంలో కొండెక్కి కూర్చున్నాడ‌ట‌. అజ‌య్ ఓ నిర్మాత‌ను అప్రోచ్ అయినా ర‌వితేజ రేటుతో నీతో సినిమా చేయ‌ను పొమ్మ‌న్నాడ‌ట‌.

ఈ విష‌యంలోనే అజ‌య్‌కు, ర‌వితేజ‌కు గ్యాప్ వ‌చ్చింద‌న్న గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఇప్పుడీ వివాదం చినికిచినికి గాలివానగా మారడంతో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రంగప్రవేశం చేసినట్టు తెలుస్తోంది. వీరిద్ద‌రికి వ‌ర్మ గురువు కావ‌డంతోనే వ‌ర్మ స‌ర్దుబాటు చేస్తున్న‌ట్టు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news