తెలంగాణలో ఇరిగేషన్ శాఖ అధికారులపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తన సొంత నియోజకవర్గంలోనే పనులు కాకపోతే రాష్ట్రంలో పరిస్థితి ఏంటని అధికారులపై మంత్రి అసహనం వ్యక్తం చేశారు. ఎక్కడ సమస్య వస్తుందో తెలుసుకొని వెంటనే పనులను మొదలు పెట్టాలని ఉన్నతాధికారులకు ఉకుం జారీ చేశారు ఉత్తమ్. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ శాఖ అధికారులపై మండిపడ్డారు.
సొంత నియోజకవర్గంలో లిప్ట్ ఇరిగేషన్ పనులు చేపట్టకపోవడంతో ఇంజనీర్ల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో అధికారులకు ఫోన్ చేసిన ఉత్తమ్.. వెంటనే పనులు చేపట్టాలని ఆదేశించారు. అలాగే ఎక్కడ సమస్య వస్తుందో తెలుసుకొని పనులు మొదలు పెట్టాలని ఉన్నతాధికారులకు ఉకుం జారీ చేశారు. పనులు మొదలు కాకపోవడం గురించి ఒకరి పై ఒకరు తోసిపుచ్చుకున్నారు జిల్లా అధికారులు. అధికారులపై మంత్రి ఫైర్ అయ్యారు. సూర్యపేట సీఈతో పాటు జిల్లా ఇరిగేషన్ అధికారులను వెంటనే హైదరాబాద్ ఆఫీస్ కు రావాలని ఈఎన్సీకి ఆదేశాలు జారీ చేసారు.