దర్శకుడు బోయపాటికి మాతృ వియోగం

331

ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ తల్లి సీతారావమ్మ అనారోగ్యంతో తుది శ్వాస విడిచారు. శుక్రవారం సాయంత్రం గుంటూరు జిల్లా పెదకాకానిలో తీవ్ర అనారోగ్య కారణంగా ఆమె మరణించారు. దీనితో బోయపాటి ఇంట్లో తీవ్ర విషాద చాయలు అలముకున్నాయి. సీతారావమ్మ గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ నేపధ్యంలో 80 ఏళ్ళ సీతారావమ్మ,

శుక్రవారం సాయంత్రం 7;30 నిమిషాల ప్రాంతంలో గుంటూరు జిల్లా పెదకాకాని గ్రామంలో తుది శ్వాస విదించారు. విషయం తెలుసుకున్న బోయపాటి శ్రీను తన కుటుంబంతో కలిసి పెదకాకాని చేరుకున్నట్టు తెలుస్తుంది. ఆమె మృతి పట్ల పలువురు సిని ప్రముఖులు సంతాపం ప్రకటించారు. అటు సోషల్ మీడియాలో కూడా బోయపాటి అభిమానులతో పాటుగా పలువురు సిని ప్రియులు బోయపాటి కుటుంబానికి సంతాపం ప్రకటించారు.