RRR ఫుల్ ఫామ్ ను ఫైనల్ చేసిన రాజమౌళి..!!

-

బాహుబలి చిత్రం తరువాత దర్శకధీరుడు రాజమౌళి ఒక క్రేజీ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. అటు మెగా,నందమూరి ఫ్యామిలీ హీరో లతో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం పై మొదటి నుంచే చాలా అంచనాలు మొదలయ్యాయి. అయితే మొదటి నుంచి కూడా ఆర్ ఆర్ ఆర్ అంటూ టైటిల్ ఖరారు చేసిన దర్శకధీరుడు అసలు దాని ఫుల్ ఫామ్ ఏంటి అన్న దానిపై మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. దీనితో ఫ్యాన్స్ లో ఒక ఇంట్రెస్ట్ మొదలైంది. ఇంతకీ అసలు ఫుల్ ఫామ్ ఏంటి అన్నది మాత్రం ఫ్యాన్స్ కు చిక్కు ప్రశ్నగా మారింది. అయితే తాజాగా ఈ ఆర్ ఆర్ ఆర్ ఫుల్ ఫామ్ పై రాజమౌళి ఒక క్లారిటీ కి వచ్చినట్లు సమాచారం. పాన్ ఇండియా మూవీగా అన్ని భాషల్లోనూ పెద్ద ఎత్తున రిలీజ్ కాబోతుంది కాబట్టి అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటే బెటర్ అని రాజమౌళి ఆలోస్తున్నారట. ఈ క్రమంలోనే లెక్కలేనన్ని టైటిల్స్‌ని చెక్ చేసి, వాటిన్నింటిలోకల్లా ఒక టైటిల్‌ను రాజమౌళి ఫైనల్ చేశారని సమాచారం. ఆ టైటిలే అందరికీ కూడా నచ్చిందట.

అయితే అంతగా దర్శకధీరుడికి నచ్చిన ఆ టైటిల్ ఏంటో తెలుసా ‘రఘుపతి రాఘవ రాజారాం’. అయితే ఈ టైటిల్ జాతిపిత మహాత్మా గాంధీజీ కి ఎంతో ఇష్టమైన భక్తి గీతం అన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే RRR కూడా ఫ్రీడమ్ ఫైటర్స్ కి సంబంధించింది కాబట్టి ఈ టైటిల్ అయితే బాగా కనెక్ట్ అవుతుందని రాజమౌళి భావిస్తున్నారట. అయితే దీనిపై క్లారిటీ కావాలి అంటే చిత్ర బృందం అధికారిక ప్రకటన చేసేవరకు ఆగాల్సిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version