K.G.F: Chapter 2: ‘కేజీఎఫ్ 2’లో ఆ నటడు రిప్లేస్..రీజన్ చెప్పిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్

-

ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలై దేశవ్యాప్తంగా విశేష ఆదరణ పొందిన చిత్రం ‘కేజీఎఫ్’. ఈ పిక్చర్ లో యశ్ హీరో కాగా, హీరోయిన్ శ్రీనిధి శెట్టి. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం చాప్టర్ 2 కోసం ప్రేక్షకులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ నెల 14న సినిమా విడుదల కానుంది. కాగా, ఈ చిత్రంలో చాప్టర్ 1లో కీలక పాత్ర పోషించిన అనంత్ నాగ్ పాత్రను విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ రిప్లేస్ చేశారు.

అందుకు గల కారణాలపైన చాలా కాలంగా ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఆయనను కావాలనే రిప్లేస్ చేశారనే ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతోంది. కాగా, ఈ విషయమై ‘కేజీఎఫ్’ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తాజాగా స్పందించారు. చాప్టర్ 2లో అనంత్ నాగ్ లేకపోవడమనేది ఆయన డెసిషనేనని పేర్కొన్నారు. అంత పెద్ద నటుడు అయిన అనంత్ నాగ్ ఎందుకు చాప్టర్ 2లో చేయలేదని ప్రశ్నించడం సబబు కాదని వివరించారు.

‘కేజీఎఫ్ చాప్టర్2’లో ప్రకాశ్ రాజ్ పాత్రకు, చాప్టర్ 1లోని అనంత్ నాగ్ పాత్రకు ఎటువంటి సంబంధం ఉండబోదని, ఈ విషయం చిత్రం చూశాకే స్పష్టంగా అందరికీ అర్థమవుతుందని వివరించారు ప్రశాంత్. ‘కేజీఎఫ్ చాప్టర్2’ పిక్చర్ కోసం జనం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సినిమా ప్రమోషన్స్ నెక్స్ట్ లెవల్ లో జరుగుతున్నాయి. బాలీవుడ్ యాక్టర్స్ సంజయ్ దత్, రవీనా టండన్, విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్, తెలుగు ప్రముఖ నటుడు రావు రమేశ్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news