Breaking : డైరెక్ట‌ర్ శ్రీ‌ను వైట్ల ఇంట విషాదం

-

ప్రముఖ డైరెక్ట‌ర్ శ్రీ‌ను వైట్ల ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ద‌ర్శ‌కుడు శ్రీ‌ను వైట్ల తండ్రి వైట్ల కృష్ణ రావు (83) ఈ రోజు ఉద‌యం కన్నుమూశారు. దీంతో ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ శ్రీ‌ను వైట్ల ఇంట్లో తీవ్ర దిగ్భ్రాంతి కి గురి అయింది. కాగ శ్రీ‌ను వైట్ల తండ్రి వైట్ల కృష్ణ రావు గ‌త కొద్ది రోజుల నుంచి ఆనారోగ్యం తో బాధ పడుతున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న త‌న సొంత గ్రామం అయిన తూర్పు గోదావ‌రి జిల్లా లోని కందుల పాలెం లో ఉన్నాడు.

ఆయ‌న ఆనారోగ్యం గా ఉన్న స‌మ‌యం లో కూడా కృష్ణ రావు త‌న సొంత గ్రామం లో నే ఉన్నాడు. కాగ కృష్ణ రావు త‌న సొంత గ్రామం కందుల పాలెం లో నే క‌న్నుమూశారు. దీంతో శ్రీ‌ను వైట్ల కు ప‌లువురు సెల‌బ్రెటీలు, సినీ ప్ర‌ముఖులు ఫోను ద్వారా సంతాపం తెలుపుతున్నారు. కాగ డైరెక్ట‌ర్ శ్రీ‌ను వైట్ల ప్ర‌స్తుతం మంచి విష్ణు తో ఢీ అంటే ఢీ అనే సినిమా తీయ‌డానికి సిద్ధం గా ఉన్నాడు. ప్ర‌స్తుతం ఈ ఢీ అంటే ఢీ అనే సినిమా కు ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌ను పూర్తి చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news