బుద్ది మార్చుకోకపోతే పోయేది పాతాలానికే.. కేటీఆర్ కి ఎంపీ చామల కౌంటర్..!

-

కేటీఆర్ తెలుగు తెలిసిన వాడిని కాదు.. తెలంగాణ గురించి తెలిసిన వాడిని అడ్మిన్ గా పెట్టుకో.. ఇలాంటి అడ్డగోలు రాతలు రాయమంటే వాళ్లే నీకింత గడ్డి పెట్టేవాడని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ పై విమర్శలు చేస్తూ.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ట్వీట్ కు చామల కౌంటర్ ఇచ్చారు. రైతుల విషయంలో మీకు, మాకు పోలికా..? వరి వేస్తే ఉరే అన్న మీరు ఎక్కడ..? రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక ధాన్యం రికార్డు  సృష్టించిన మేమెక్కడ..? అని ప్రశ్నించారు. 

రైతులకు రూ.లక్ష రుణమాఫీ అని చెప్పి ఐదేండ్లు వంచించిన మీరెక్కడ..? మాటిచ్చిన ఏడాదిలోపే రూ.2లక్షల రైతు రుణమాఫీ చేసిన మేమెక్కడ అంటూ కేవలం పెట్టుబడి సాయం పేరుతో రాళ్లు, రప్పలకు రూ.22వేల కోట్లు మింగిన మీరు ఎక్కడ..? పండించే ప్రతీ భూమికి రూ.12వేల రైతు భరోసాతో పాటు రూ.500 బోనస్, పంట బీమా, పంట నష్టపరిహారం, సబ్సీడీ విత్తనాలు కల్పిస్తున్న మేమెక్కడ..? అని ప్రశ్నించారు. అసెంబ్లీలో జాడిచ్చి తన్ని.. పార్లమెంట్ లో పాతరేసిర్రు అంటూ.. ఇంకా మీ బుద్దిమార్చుకోకపోతే పోయేది పాతాళానికే అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఎంపీ చామల.

Read more RELATED
Recommended to you

Latest news