ఎన్టీఆర్ కోసం పోటీ పడుతున్న దర్శకులు…!

-

నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్ హవా ఇప్పుడు టాలీవుడ్ లో కొనసాగుతుంది. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ ఒక సినిమా చేస్తున్నాడు. దాదాపు 80 శాతంపైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాపై టాలీవుడ్ జనాలు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడు వస్తుందా అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఈ సినిమా గురించి ఏ చిన్న వార్త వచ్చినా సరే ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు

ఇది పక్కన పెడితే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి దర్శక నిర్మాతలు ఎక్కువగా పోటీ పడుతున్నారు. అతనితో సినిమా చేయడానికి త్రివిక్రమ్ సిద్దంగా ఉన్నాడు. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ చేసే సినిమా ఇదే. ఈ సినిమా కథ కూడా దాదాపుగా సిద్దంగా ఉంది. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ ఎవరితో చేస్తాడు అనేది ఆసక్తికరంగా మారింది.

ఈ సినిమా తర్వాత సుకుమార్ తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా కథ కూడా దాదాపుగా రెడీ చేసాడని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ ని కూడా ఖరారు చేసినట్టు సమాచారం. ప్రస్తుతం చేస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా వచ్చే ఏడాది జనవరి 8 న ప్రేక్షకుల ముందుకి రానుంది.

Read more RELATED
Recommended to you

Latest news