తండ్రి నుంచి వారసత్వంగా వెంకీ ఎన్ని వేల కోట్లు పొందాడో తెలుసా..?

-

ప్రముఖ టాలీవుడ్ దిగ్గజ నిర్మాతలలో ఒకరైన డి.రామానాయుడు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎన్టీఆర్ , ఏఎన్నార్ లాంటి స్టార్ హీరోలతో అద్భుతమైన చిత్రాలను తెరకెక్కించి స్టార్ ప్రొడ్యూసర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈయన వారసుడు దగ్గుబాటి వెంకటేష్ సినీ ఇండస్ట్రీలోకి కలియుగ పాండవులు అనే సినిమా ద్వారా తండ్రి సహాయంతో అడుగుపెట్టాడు. ఇక మొదటి సినిమాతోనే డెబ్యూ హీరోగా అవార్డును సొంతం చేసుకున్న వెంకటేష్. ఆ తర్వాత వరుస ఫ్యామిలీ చిత్రాలు చేస్తూ మరొకవైపు మాస్ ఆడియన్స్ కు బాగా దగ్గరయ్యాడు. ఇకపోతే తన సినిమాలలో తానే కామెడీని పండిస్తూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న వెంకటేష్ ఇప్పటికీ కూడా స్టార్ హీరోగా వరుస సినిమాలు చేస్తూ మంచి ఫామ్లో దూసుకుపోతున్నాడు.

ఇకపోతే తాజాగా అనిల్ రావిపూడి దర్శకత్వం లో విడుదలైన F3 సినిమాలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో స్క్రీన్ షేర్ చేసుకున్న వెంకటేష్.. మొదటి షో తోనే మంచి రెస్పాన్స్ అందుకోవడం గమనార్హం. ఇకపోతే మంచి సక్సెస్ ను అందుకున్న వెంకటేష్ కు సంబంధించి ఒక వార్త బాగా వైరల్ గా మారుతోంది.అదేమిటంటే ఆయన సినిమాల ద్వారా సంపాదించిన ఆస్తి ని బిజినెస్ ద్వారా సంపాదించిన ఆస్తి ని పక్కన పెడితే తన తండ్రి నుంచి వారసత్వంగా ఎన్ని వేల కోట్లు అందుకున్నాడు అనే విషయం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయం తెలుసుకునే ముందు వెంకటేష్ తన సొంత ప్రతిభతో ఎంత ఆస్తి కూడబెట్టాడు అనే విషయం తెలుసుకుందాం.

వెంకటేష్ సినిమాలలో నటిస్తూనే మరొక వైపు సక్సెస్ఫుల్ వ్యాపారవేత్తగా కూడా తన సత్తా చూపిస్తున్నారు. సుమారుగా 35 సంవత్సరాల కు పైగా ఇండస్ట్రీలో ఉన్న ఈయన హైదరాబాదులో తన ఇంటిని చూస్తే మాత్రం మతిపోవాల్సిందే . ఇంద్ర భవనాని తలపిస్తున్న ఆ ఇంటిలో వెంకటేష్ తన కుటుంబంతో నివసిస్తున్నాడు. ఇక తన అన్నయ్య ప్రముఖ నిర్మాత సురేష్ బాబు సలహామేరకు బిజినెస్ తో పాటు రియల్ ఎస్టేట్ రంగంలో కూడా పెట్టుబడులు పెట్టి బాగా దూసుకుపోతున్నారు అని చెప్పవచ్చు. మొత్తంగా రూ.2,300 కోట్ల వరకు ఈయన ఆస్తి ఉంటుందని సమాచారం. ఇక తండ్రి రామానాయుడు నుండి వారసత్వంగా రూ.5000 వేల కోట్ల రూపాయల వరకు ఆస్తి లభించింది అని ట్రేడ్ వర్గాలు చెపుతున్నాయి. మొత్తంగా చూసుకుంటే రూ.7, 300 కోట్ల రూపాయల ఆస్తికి వారసుడు వెంకటేష్ అని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news