మెగా కోడలు లావణ్య త్రిపాఠి ప్రాపర్టీ ఎన్ని కోట్లో తెలుసా..?

-

మెగా ప్రిన్స్ హీరో వరుణ్ తేజ్ ప్రముఖ హీరోయిన్ లావణ్య త్రిపాటి ప్రేమించుకుంటున్నారు అంటూ వస్తున్న వార్తలకు ఎట్టకేలకు బ్రేక్ పడిందని చెప్పవచ్చు. నిన్న రాత్రి 8 గంటలకు నాగబాబు ఇంట్లో అంగరంగ వైభవంగా వరుణ్ తేజ్ , లావణ్య త్రిపాఠిల నిశ్చితార్థం జరిగింది. ఈ కార్యక్రమానికి మెగా, అల్లు ఫ్యామిలీతో పాటు లావణ్య ఫ్యామిలీలు సందడి చేశారు. అత్యంత సన్నిహితుల మధ్య వీరి నిశ్చితార్థం చాలా అంగరంగ వైభవంగా జరిగింది. ఈ క్రమంలోనే మెగా ఇంటికి కోడలు కాబోతున్న లావణ్య త్రిపాఠి ఆస్తులు విలువ ఎంత అన్న విషయాలు కూడా ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.

ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో ఉన్నత కుటుంబంలో జన్మించిన లావణ్య త్రిపాఠి డెహ్రాడూన్ లోనే జరిగింది. ఈమె తండ్రీ హైకోర్టు న్యాయవాది కాగా, తల్లి ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నారు. లావణ్య త్రిపాటికి ఒక చెల్లెలు, తమ్ముడు కూడా ఉన్నారు. అయితే మీరు ఎప్పుడూ కూడా ఇండస్ట్రీ వైపు అడుగులు వేయలేదు. అయితే లావణ్య కి మాత్రం చిన్నప్పటినుంచే గ్లామర్ ప్రపంచంలోకి రావాలని ఇష్టం ఉండడంతో తండ్రి కండిషన్ మేరకు చదువు పూర్తి చేసి ఆ తర్వాత మోడలింగ్ మొదలు పెట్టింది.

నా తర్వాత ఇండస్ట్రీలోకి నెమ్మదిగా అడుగుపెట్టిన ఈమె అందాల రాక్షసి సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇకపోతే బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో అవకాశాలు దక్కించుకుంది కానీ స్టార్ హీరోయిన్ రేంజ్ కు చేరుకోలేకపోయింది. హీరోయిన్గా వరుస సినిమాలు చేస్తూ రెండు చేతుల సంపాదిస్తున్న ఈమె తన తండ్రి ఆస్తి కాకుండా కేవలం ఈమె మాత్రమే రూ.20 కోట్ల వరకు కూడబెట్టిందని తెలుస్తోంది. ఇకపోతే మెగా ఇంటికి కోడలు కాబోతోంది కాబట్టి సినిమాలలోకి పెళ్లి తర్వాత వస్తుందా రాదా అన్నది ఇప్పుడు సస్పెన్స్ గా మారిపోయింది.

Read more RELATED
Recommended to you

Latest news