చంకల్లో చెమట అస్సలు పట్టకుండా ఉండాలంటే.. ఇలా చేయండి..!

-

కొంత మందికి చెమట విపరీతంగా పడుతుంది ముఖ్యంగా చంకల్లో చెమట ఎక్కువగా పడుతూ ఉంటుంది దాంతో దుర్వాసన కలుగుతుంది. అలానే చంకల్లో చెమట ఎక్కువగా పట్టడం వలన దురద వంటి ఇబ్బందులు కూడా కలుగుతూ ఉంటాయి. ఇవన్నీ ఒక ఎత్తైతే బయటికి వెళ్ళినప్పుడు చంకల్లో చెమట పడితే చూడడానికి అస్సలు బాగోదు.చాలామంది ఈ సమస్యతో బాధపడుతూ ఉంటారు పైగా చెమట వలన దుస్తులు పై మరకలు కూడా వచ్చేస్తూ ఉంటాయి. కొంచెం ఖరీదైన బట్టలు వేసుకుంటే పాడైపోతాయి. అయితే చంకల్లో చెమట తగ్గాలంటే ఇలా చేయండి.

చంకల్లో చెమట శారీరిక పని వలన కలుగుతుంది శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడానికి సహాయపడుతుంది శరీరం చాలా వేడిగా అయినప్పుడు శరీరాన్ని చల్లబరిచేందుకు చెమట పడుతుంది. చంకల్లో చెమట ఎక్కువగా పట్టకూడదు అంటే పరిశుభ్రత చాలా ముఖ్యం దుర్వాసనను కలిగించే బ్యాక్టీరియా పెరుగుదలని ఆపడానికి సబ్బు తో క్రమం తప్పకుండా మీ చంకలని శుభ్రం చేసుకోండి. స్నానం చేసిన తర్వాత మీ చంకలని బాగా తుడుచుకోండి గాలి ఆడేటట్టు ఉంచండి తడి లేకుండా చూసుకోండి.

చాలామంది డియోడ్రెంట్స్ ని వాడుతూ ఉంటారు వాటి కంటే యాంటీ పెర్స్పిరెంట్లను ఉపయోగించండి. చెమట ని ఇది తగ్గిస్తుంది అల్యూమినియం క్లోరైడ్ కలిగి ఉన్న యాంటీ పెర్స్పిరెంట్లను ఉపయోగించండి రాత్రి పడుకునే ముందు వీటిని ఉపయోగిస్తే చెమట బాగా తగ్గుతుంది గాలి ఆడే బట్టలు వేసుకుంటే కూడా చెమట ఎక్కువ పట్టదు. కాటన్ బట్టలు వంటి వాటిని వేసుకుంటే చెమట తగ్గుతుంది ఒత్తిడి ఆందోళన వలన కూడా చమట బాగా పడుతుంది.

కాబట్టి ఒత్తిడి లేకుండా చూసుకోండి రోజు యోగా ధ్యానం వంటివి చేస్తూ ఉండండి. ఎక్కువ నీటిని తీసుకుంటూ ఉండండి. శరీర ఉష్ణోగ్రత నియంత్రణలో ఉంటుంది చెమట కూడా తగ్గుతుంది. బరువు ఎక్కువ ఉండడం వలన కూడా చెమట బాగా పడుతుంది కాబట్టి బరువుని కూడా కంట్రోల్ చేసుకోవాలి ఇలా ఈ టిప్స్ ని పాటించారంటే కచ్చితంగా చెమట ఎక్కువ పట్టకుండా ఉంటుంది. చంకల్లో చెమట ఎక్కువ పట్టదు చక్కగా ఉండొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news