Mahesh Babu: గ్రామ సమస్య పరిష్కరించే యువకుడిగా మహేశ్ బాబు..‘సర్కారు వారి పాట’ కథ ఇదేనా!

-

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు తెలుగు ప్రేక్షకులకు చివరగా ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో కనిపించారు. ఆ తర్వాత ఆయన నటించిన సినిమాలు విడుదల కాలేదు. ‘గీతా గోవిందం’ ఫేమ్ డైరెక్టర్ పరశు రామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సర్కారు వారి పాట’ పిక్చర్ ఒక పాట మినహా మిగతా షూట్ పూర్తయింది. వచ్చే నెల 12న ఈ మూవీ రిలీజ్ కానుంది.

ఈ క్రమంలోనే ‘సర్కారు వారి పాట’ ఫిల్మ్ స్టోరి లైన్ గురించి నెట్టింట ఆసక్తికర చర్చ సాగుతున్నది. అభిమానులు ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. కాగా, మహేశ్ బాబు మళ్లీ సేమ్ ఓల్డ్ స్టోరితోనే ఫిల్మ్ చేశారని టాక్. థియేటర్స్ టికెటింగ్ పార్ట్‌నర్ ‘బుక్ మై షో సినోప్ సిస్’ ప్రకారం..‘సర్కారు వారి పాట’ సినిమాలో మహేశ్ బాబు ‘అజయ్’ అనే పాత్ర పోషిస్తున్నారు.

ఇంట్రెస్ట్ రికవరీ ఏజెంట్ గా ఉన్న అజయ్ అలియాస్ మహేశ్ బాబు ఓ గ్రామంలోని ప్రధాన సమస్య పరిష్కరించేందుకు ఎలా వెళ్తాడు? అందుకు గల కారణాల నేపథ్యంలో స్టోరి ఉంటుందని తెలుస్తోంది. ఈ మేరకు బుక్ మై షో విశ్లేషణను సోషల్ మీడియాలో #SarkaruVaariPaata #MaheshBabu హ్యాష్ ట్యాగ్స్ తో ట్వీట్ చేస్తున్నారు. టాలీవుడ్ బాక్సాఫీసు వారు తమ ట్విట్టర్ అఫీషియల్ హ్యాండిల్ లో ఈ విషయం షేర్ చేయగా, అది మహేశ్ సినిమా గురించి డిస్కషన్ కు కారణమవుతున్నది.

‘సర్కారు వారి పాట’ సినిమా డెఫినెట్ గా విజయం సాధిస్తుందని దర్శకులు పరశురామ్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ పిక్చర్ లో మహేశ్ కు జోడీగా ‘మహానటి’ కీర్తి సురేశ్ నటించింది. ఎస్.ఎస్.థమన్ మ్యూజిక్ అందించగా, ఇప్పటికే విడుదలైన ‘కళావతి, పెన్నీ’ సాంగ్స్ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

ఈ చిత్రంలో మహేశ్ చాలా యంగ్ గా కనబడుతున్నారు. వచ్చే నెల 12న సినిమా విడుదల కానున్న నేపథ్యంలో త్వరలో సినిమా ప్రమోషన్స్ కు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు వినికిడి.ఇంతకీ సినిమా కథ ఏంటి? అనేది తెలియాలంటే వచ్చే నెల 12న విడుదల కానున్న ‘సర్కారు వారి పాట’ సినిమాను చూడాల్సిందే. అప్పుడే అసలైన కథ తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version