శేషాచలం ఎన్ కౌంటర్ బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది: సీఎం స్టాలిన్

-

ఆంధ్ర ప్రదేవ్ లో 2015లో జరిగిన శేషాచలం ఎన్ కౌంటర్ పై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ స్పందించారు. న్యాయం కోసం ఆ కుటుంబాలు చేస్తున్న న్యాయపరమైన పోరాటానికి తమిళనాడు ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రకటించారు. 2015, ఎప్రిల్ 7న జరిగిన ఎన్ కౌంటర్లలో 20 మంది ఎర్రచందనం స్మగ్లర్లు మరణించారు. ఇది ఓ బ్లాక్ డే అంటూ సీఎం స్టాలిన్ వ్యాఖ్యానించారు.

2015లో చిత్తూర్ జిల్లా చంద్రగిరి మండలం ఈటగుంట, వచ్చిందౌ బండ శేషాచలం అటవీ ప్రాంతంలో ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్న కూలీలపై యాంటీ స్మగ్లింగ్ టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో దాడులు చేయగా… స్మగ్లర్లు గొడ్డళ్లు, రాళ్లతో ఎదురుదాడి చేశారు. దీంతో టాస్క్ ఫోర్స్ టీం ఎదురుకాల్పులు చేయడంతో తమిళనాడుకు చెందిన 20 మంది కూలీలు మరణించారు. ఈ ఘటనపై తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య కాస్త ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి పళని స్వామి ఈ ఎన్ కౌంటర్ కు కారణమైనవాళ్లను చట్టపరంగా శిక్షించాలని అప్పటి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version