‘కర్ణుడి’గా ఎన్టీఆర్ ప్రభంజనం..పోటీగా వచ్చిన కృష్ణ, మురళీమోహన్, శోభన్ బాబు, కృష్ణంరాజు..!

-

తెలుగు ప్రజల ఆరాధ్యుడు సీనియర్ ఎన్టీఆర్..పోషించిన సాంఘీక, పౌరాణిక, జానపద పాత్రల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రతీ ఒక్కరి హృదయంలో పౌరాణిక పాత్రలు అయిన కృష్ణుడు, రాముడు, దుర్యోధనుడు, కర్ణుడు అనగానే.. టక్కున సీనియర్ ఎన్టీఆర్ గుర్తుకొస్తారనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. తెలుగు చిత్ర చరిత్ర ఉన్నంత కాలం పౌరాణిక పాత్రలకు పెట్టింది పేరుగా సీనియర్ ఎన్టీఆర్ ఉంటారు. కాగా, ఆయనతో పౌరాణిక సినిమాల్లో పోటీగా వచ్చారు కృష్ణ, కృష్ణంరాజు, శోభన్ బాబు, మురళీ మోహన్. బాక్సాఫీసు వద్ద ఎవరు నెగ్గారంటే..

ఎన్టీ రామారావు స్వీయ దర్శకత్వం వహించడంతో పాటు నటించిన చిత్రం ‘దాన వీర శూర కర్ణ’. ఈ సినిమాకు స్టోరి, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ ఎన్టీఆర్‌యే…తన దర్శకత్వ ప్రతిభను ఈ సినిమా ద్వారా నిరూపించుకున్నారు ఎన్టీఆర్.

rebel star krishnam raju

ఈ మూవీకి పోటీగా సూపర్ స్టార్ కృష్ణ..మహాభారత కథతో ‘కురుక్షేత్రం’ అనే సినిమాతో వచ్చారు. ఇందులో అర్జునుడిగా కృష్ణ , కృష్ణుడిగా శోభన్ బాబు, కర్ణుడిగా కృష్ణంరాజు నటించారు. కానీ, ఈ సినిమా బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది.

ఎన్టీఆర్ ‘దాన వీర శూర కర్ణ’కు పోటీగా మురళీ మోహన్, నరసింహరాజులు కీలక పాత్రలు పోషించిన ‘రంభ ఊర్వశీ మేనకా’ విడుదలయింది. ఇది కూడా ఎన్టీఆర్ ప్రభంజనం ముందు నిలవలేకపోయింది.

అలా ఎన్టీఆర్ అప్పట్లో ‘దాన వీర శూర కర్ణ’ పిక్చర్ తో సంచలనం సృష్టించారు. ఈ మూవీని మూడు సార్లు విడుదల చేయగా, ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. రూ.20 లక్షలు ఈ సినిమా మేకింగ్ కు ఖర్చు కాగా అప్పట్లో ఈ చిత్రానికి రూ.3 కోట్లు ప్రాఫిట్ వచ్చిందట. అలా సీనియర్ ఎన్టీఆర్ పౌరాణిక సినిమాతో తెలుగు చిత్ర చరిత్రలో గుర్తుండిపోయే అరుదైన రికార్డు సృష్టించారని చెప్పొచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version