డబ్బులు సంపాదించాలంటే పెద్ద పెద్ద చదువులే చదవక్కర్లేదు. బుద్దిబలం, శారీరక బలం ఉన్నా లక్షల్లో సంపాదించేయొచ్చు. సెలబ్రెటీల కారు డ్రైవర్లకు, బాడీ గార్డులకు జీతాలు ఎంత ఉంటాయో మీకు తెలిసే ఉంటుంది. సినిమా సెలబ్రెటీలకు ఉండే క్రేజ్ గురుంచి తెలిసిందే. సినిమాలు, ఈవెంట్లు, ప్రకటనలతో బిజీగా ఉండే వారి డైరీల్లో ఖాళీ పేజీ ఉండదు. దానికి తగ్గట్టే వారి ఆదాయం కూడా ఉంటుంది. అదే బాలీవుడ్ స్టార్ హీరోల విషయానికి వస్తే వారి సంపాదన ఏడాదికి వందల కోట్లలో ఉంటుంది. ఇక వారి బాడీగార్డలకు శాలరీ ఎంత ఉంటుందో తెలుసా..?
ఆ హీరోల సంపాదనకు అనుగుణంగా వారి మెయింటైన్సు అలాగే ఉంటుంది. మరి అలాంటి హీరోలకు సెక్యూరిటీ ఇచ్చే బాడీ గార్డులకు ఇచ్చే జీతాలు ఏ రేంజ్‌లో ఉంటాయి. స్టార్ హీరోల బాడీగార్డ్‌ల ఏడాది జీతం ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. స్టార్ హీరోలకు ప్రేక్షకులలో ఉండే క్రేజ్ మామూలుగా ఉండదు. దాని వల్ల వారు బయటికి రావడం అంత సులభం కాదు. వారికి సెక్యూరిటీ ఉండాలి. అందులోనూ నమ్మకమైన బాడీ గార్డు కూడా ఉండాలి. రక్షణ కవచం వలె పని చేసే బాడీ గార్డులకు స్టార్ హీరోలు వారి రేంజ్‌లో జీతాలు ఇస్తున్నారు. వేలల్లో, లక్షల్లో కాదు. వారి ఏడాది జీతం కోటల్లో ఉంది.
వీరి జీతం చిన్న హీరోలలో కొందరి రెమ్యూనరేషన్‌తో సమానం.
అందరి కన్నా ఎక్కువ జీతం తీసుకునే బాడీగార్డ్ రవి సింగ్. ఇతను బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ బాడీగార్డు. రవి సింగ్ నెల జీతం దాదాపు రూ.17 లక్షలు, అంటే సంవత్సరానికి రూ.2.7 కోట్ల పైనే సంపాదిస్తున్నాడు. అతని తరువాతి స్థానంలో ఉన్న బాడీగార్డు షేరా, సల్మాన్ ఖాన్ బాడీగార్డ్. షేరా సుమారు 29 సంవత్సరాలుగా సల్మాన్ ఖాన్ దగ్గరే బాడీ గార్డుగా ఉన్నాడు. షేరా నెల శాలరీ రూ.15 లక్షలు, అంటే ఏడాదికి రెండు కోట్ల అని తెలుస్తోంది.
ఆమిర్ ఖాన్ బాడీగార్డ్ యువరాజ్ ఘోర్పడేకి సంవత్సరానికి రెండు కోట్లు జీతం. దీపికా పదుకొణె బాడీగార్డ్ జలాల్ కి ఏడాదికి రూ.1.2 కోట్లు, అనుష్క శర్మ బాడీగార్డ్ ప్రకాశ్ సింగ్ ఏడాదికి రూ.1.2 కోట్లు జీతం తీసుకుంటునట్లు తెలుస్తోంది.
అక్షయ్ కుమార్ బాడీగార్డు శ్రేయ్‌సే థెస్లె సంవత్సరానికి రూ.1.2 కోట్ల జీతం అని తెలుస్తోంది. అమితాబ్ బచ్చన్‌కు బాడీగార్డుగా పనిచేసిన జితేంద్ర షిండే ఏడాదికి రూ.1.5 కోట్లు జీతం తీసుకున్నాడు. ఆరేళ్ల పాటు అమితాబ్ బాడీగార్డ్ పని చేసి 2021 ఆగస్టు తర్వాత మానేశాడు.