హాస్యబ్రహ్మ బ్రహ్మానందం హీరోగా నటించిన సినిమా ఏంటో తెలుసా..?

-

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో హాస్యబ్రహ్మగా గుర్తింపు తెచ్చుకున్న బ్రహ్మానందం గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. ముఖ కవళికలతోనే ఇతరులకు ఆనందాన్ని తెప్పించే బ్రహ్మానందం అంటే ఎవరికైనా ఇష్టమే. ముఖ్యంగా డైలాగులు చెప్పి కామెడీ పండించాల్సిన అవసరం లేదు.. ఆయన పేరు చెబితే చాలు మన మోములో నవ్వు విరబూస్తుంది. కాస్త హావభావాలు పలికించారంటే చాలు పొట్ట చెక్కలయ్యేలా నవ్వేస్తారు ప్రేక్షకులు. అందుకే అందరూ ఆయనను హాస్యబ్రహ్మ అని కూడా పిలుస్తారు.

మూడున్నర దశాబ్దాల కాలంలో తన సినీ కెరియర్లో సుమారు 1200 కు పైగా సినిమాలలో నటించి కేవలం కామెడియన్ గానే ప్రేక్షకులను అలరించిన బ్రహ్మానందం అంటే ఎవరైనా ఇష్టపడతారు. ముఖ్యంగా ఒకవైపు కామెడీ పండిస్తూనే మరొకవైపు విలక్షణ పాత్రలలో కూడా అలరించారు. మిగతా నటులతో పోల్చి చూస్తే విలక్షణమైన నటనతో ప్రత్యేకమైన డైలాగ్ డెలివరీతో అద్భుతమైన ముఖ కవళికలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న బ్రహ్మానందం ఇప్పటికీ స్టార్ కమెడియన్ గా కొనసాగుతూ ఉండడం విశేషం.

ఇకపోతే బ్రహ్మానందం విషయానికి వస్తే.. లెక్చరర్ గా పనిచేసిన ఆయన అహనా పెళ్ళంట అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి అడుగుపెట్టారు. బ్రహ్మానందం కూడా హీరోగా నటించారని చాలామందికి తెలియదు. ఆయన హీరోగా నటించిన సినిమా బాబాయ్ హోటల్. జంధ్యాల దర్శకత్వం వహించిన ఈ సినిమాని క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్ పై కేఎస్ రామారావు నిర్మించారు. బ్రహ్మానందానికి జోడిగా మధుశ్రీ నటించిన ఈ సినిమా 1992లో విడుదలైన ఈ సినిమా ఎందుకో ఆశించని విధంగా సక్సెస్ అందుకోలేదు. కానీ ఈ సినిమాలో ఎప్పుడు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన బ్రహ్మానందం సీరియస్ పాత్రలో ఎమోషనల్ గా ప్రేక్షకులను కంటతడి పెట్టించారు.

Read more RELATED
Recommended to you

Latest news