తెలుగుదేశం పార్టీకి, ఎస్వీ రంగారావుకి మధ్య ఉన్న సంబంధం ఏంటో తెలుసా..?

-

తెలుగు చలనచిత్ర పరిశ్రమను ఉన్నత స్థానంలో నిలబెట్టి… సినిమా ఇండస్ట్రీకి మూల స్తంభంగా నిలిచిన ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇకపోతే తెలుగు సినిమా ఖ్యాతిని ఎల్లలు దాటించిన ఎంతోమంది దిగ్గజ నటుల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న ఎస్వీ రంగారావు మొదటి తరం సినీ నటులలో ఈయన కూడా ఒకరనే చెప్పాలి. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మాత్రమే కాకుండా విలన్ పాత్రలను కూడా చేస్తూ తనకు తిరుగులేదు అనిపించుకున్నారు.

అంతేకాదు తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే రారాజుగా ఒక వెలుగు వెలిగిన ఎస్.వి.రంగారావు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన నటుడు కావడం తెలుగు వాళ్ళు చేసుకున్న అదృష్టమని చెప్పవచ్చు. ఇలా తెలుగులో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఎస్వీ రంగారావు ఎక్కువగా తమిళ్ భాషలోనే సినిమాలు చేశారు. అప్పట్లో కాంగ్రెస్ పార్టీని పూర్తిగా సమర్థిస్తూ వచ్చిన ఆయన ఎలాంటి సమయంలో అయినా సరే రాజకీయ చర్చలు వస్తే.. కాంగ్రెస్ ను గుడ్డిగా ఆయన సమర్థిస్తూ మాట్లాడుతూ ఉండేవారట.

ఈ క్రమంలోనే ఎన్టీఆర్ తో కూడా ఎస్వీ రంగారావు ఎక్కువగా రాజకీయాలకు సంబంధించిన చర్చలు జరిపే వారని.. ఇక అందుకే ఎన్టీఆర్ దృష్టి కూడా రాజకీయాల వైపు వెళ్లడానికి ప్రధమ తొలి మెట్టు అయిందని సమాచారం. ముఖ్యంగా ఎన్టీఆర్ ఎక్కువగా ఎస్వీ రంగారావు నటనను కాపీ కొట్టి ఆయన లాగా నటించడానికి ప్రయత్నం చేసే వారట. ఇది చూసిన రంగారావు కాంగ్రెస్ ను చూసి కాపీ కొట్టినట్టు ఉంటుంది అంటూ రాజకీయ పరిభాషలో చమత్కరించేవారట..

అప్పట్లో కాంగ్రెస్ పార్టీ పెద్ద పార్టీ అని మిగతావన్నీ చిన్న పార్టీలను ఆయన తన దృష్టిలో చెప్పేవారట. అంతేకాదు నీ అంతటి నువ్వు ఎదిగే ప్రయత్నం చేయమని కూడా ఎన్టీఆర్కు సలహా ఇచ్చారు. ఇక ఆ తర్వాత రామారావు రాజకీయాల్లోకి వచ్చే సమయంలో కాంగ్రెస్ ని కాపీ కొట్టకుండా సొంతంగా తెలుగుదేశం పార్టీని స్థాపించి రాజకీయాలలో రాణించారు. కాంగ్రెస్ నే వ్యతిరేకిస్తూ ఎన్నో కొత్త పార్టీలు వచ్చినా సరికొత్త టైటిల్ తో రాజకీయ పార్టీని సృష్టించి.. 9 నెలలకి అధికారంలోకి వచ్చారు. అలా ఎస్వీ రంగారావు చెప్పిన మాటలు ఎన్టీ రామారావు కు రాజకీయంగా బాగా పనికి వచ్చాయని చెప్పాలి. అంతేకాదు పార్టీ పెట్టడానికి కూడా కారణం ఆయనే అన్నట్టుగా వార్తలు వినిపిస్తూ ఉంటాయి.

Read more RELATED
Recommended to you

Latest news