“పుష్ప” సినిమా మీద అల్లు అర్జున్ ఏం చెప్పారో తెలుసా ..?

-

సుకుమార్ సినిమా అంటే ఏ హీరోకైనా వెయ్యేనుగుల బలం వస్తుంది. ముఖ్యంగా అల్లు అర్జున్ కైతే మరీను. అందుకు కారణం గంగోత్రి తర్వాత అల్లు అర్జున్ కి స్టైలిష్ స్టార్ అన్న పేరు ఆర్య తో తెచ్చి పెట్టింది సుకుమార్ కాబట్టి. సుకుమార్ డెబ్యూ సినిమా ఆర్య. మొదటి సినిమాతోనే ఇద్దరికి మంచి ఫ్రెండ్ షిప్ ఏర్పడింది. ఈ ఇద్దరికి రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ కూడా తోడయ్యాడు. ఆర్య ఆ తర్వాత ఆర్య2 సినిమాలలో సుకుమార్ అల్లు అర్జు ని చాలా క్లాస్ గా చాలా స్టైలిష్ గా చూపించాడు. సుకుమార్-అల్లు అర్జున్-దేవీశ్రీప్రసాద్ కాంబినేషన్ అంటే ఆ సినిమా మ్యూజికల్ గా సూపర్ హిట్….సినిమా పరంగా సూపర్ హిట్ అవ్వాల్సిందే.

 

ఇక సుకుమార్ ప్రతీ సినిమాకి దేవీ శ్రీప్రసాద్ కథా నేపథ్యం ఎలాంటిదైనా అదిరిపోయో మ్యూజిక్ ఇవ్వాల్సిందే. ముఖ్యంగా సుకుమార్ గత సినిమా రంగస్థలం. ఈ సినిమాకి దేవీ శ్రీప్రాసాద్ ఇచ్చిన అద్భుతమైన మ్యూజిక్ సినిమా హిట్ కి సగం కారణమైంది. అప్పటి నుంచే అల్లు అర్జున్ కి అలాంటి కథ అలాంటి పాత్రలో నటించాలని డిసైడైపోయాడు. ఇదే మాటని రంగస్థలం సినిమా చూశాక సుకుమార్ తో అల్లు అర్జున్ చెప్పాడట. ఆర్య, ఆర్య 2 లో చూపించిన విధంగా కాకుండా రంగస్థలం లో రాం చరణ్ లా మాసీగా గెటప్ లో చూపిస్తావా అని అడిగాడట.

దాంతో సుకుమార్ మైండ్ లో అల్లు అర్జున్ ఎలా చూపించాలి అన్న ఆలోచన అప్పుడే మొదలైందట. అందుకే ప్రత్యేకంగా అల్లు అర్జున్ కోసమే ఈ కథ రాశాడు సుకుమార్. కేవలం ఒకే ఒక్క సిట్టింగ్ లో ప్రాజెక్ట్ ని ఫైనల్ చేశాడంటే అల్లు అర్జున్ కి ఈ కథ ఎంతగా నచ్చిందో అర్థం చేసుకోవచ్చు. అదీ గాకా నీకోసం ఎలా తయారవమన్నా అవుతా
నా మేకోవర్ నీ ఇష్టం అని చెప్పాడట అల్లు అర్జున్. దాంతో సుకుమార్ కి బాగా ఫ్రీడం దొరికింది. అందుకే చాలా రకాల గెటప్స్ చెప్పాడట సుకుమార్ అల్లు అర్జున్ కి. చెప్పినవన్ని విపరీతంగా నచ్చాయట. అయినా అన్నిటికంటే తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్ లో ఉన్న గెటప్ విపరీతంగా నచ్చి ఫైనల్ చేశాడట. అంతేకాదు ఇందులో మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నాయంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news