‘దిల్’ రాజును వెంకటేశ్ ఏమని పిలుస్తారు..? ఆయనకు ఆ పేరు ఎలా వచ్చిందంటే?

-

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు..ప్రజెంట్ క్రేజీ ఫిల్మ్స్ ను ప్రొడ్యూస్ చేస్తున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆయనకున్న గుర్తింపు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఫిల్మ్ ను స్టోరి నుంచి ఇన్వాల్వ్ అయి నటీ, నటుల ఎంపికతో పాటు పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్స్ ఇలా ప్రతీ విషయంలో దిల్ రాజు కాన్సంట్రేట్ చేస్తారు.

‘దిల్’ రాజు కు ‘దిల్’ రాజు అన్న పేరు ఎలా వచ్చిందో..ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని తెలుగు సినిమా లవర్స్ అందరికీ తెలుసు. ‘దిల్’ మూవీ సూపర్ హిట్ అయిన నేపథ్యంలో ఆయనకు ‘దిల్’ రాజు అనే పేరు వచ్చింది. కాగా, ఆయనను తొలుత ‘నైజాం’ రాజు అని పిలిచేవారన్న సంగతి చాలా కొద్ది మందికి తెలుసు.

‘నైజాం’లో సినిమాను డిస్ట్రిబ్యూట్ చేస్తు్న్న నేపథ్యంలో ఆయనకు ‘నైజాం’ రాజు అని పేరు వచ్చింది. ఇక ‘దిల్ ’ మూవీ చేసిన క్రమంలో ‘దిల్’ రాజు అని పేరు వచ్చింది. కాగా, ఆయనకు ఆ పేరు రావడంలో బూరుగుపల్లి శివరామకృష్ణ సహకారముందని దిల్ రాజు చెప్పుకొచ్చారు.

Venkatesh to team up with shekhar kammula

‘దిల్’ సినిమా చేసే క్రమంలో ఆ టైటిల్ ఆయన వద్ద ఉండగా, తాను రిక్వెస్ట్ చేయగా ‘దిల్’ టైటిల్ ఇచ్చారని దిల్ రాజు గుర్తు చేసుకున్నారు. ఇకపోతే విక్టరీ వెంకటేశ్ ఇప్పటికీ తాను ఎక్కడ కనబడినా ‘దిల్’ అని పిలుస్తాడని వివరించారు దిల్ రాజు. దిల్ రాజు-అనిల్ రావిపూడి-విక్టరీ వెంకటేశ్ కాంబోలో ఇటీవల విడుదలైన F3 సూపర్ హిట్ అయిన సంగతి అందరికీ విదితమే.

Read more RELATED
Recommended to you

Exit mobile version