బాహుబలి సినిమాలో అనుష్క డూప్ గా నటించింది ఎవరో తెలుసా..?

-

రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం బాహుబలి.. 2 పార్ట్లుగా వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు అత్యధిక కలెక్షన్లను కూడా రాబట్టింది.. ఇక మొదటి భాగంలో బానిసగా.. రెండవ భాగంలో యువరాణిగా నటించి అలరించిన అనుష్క నటనకు ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు.. ఒక పాత్రలో ప్రభాస్ కి తల్లిగా.. మరొక పాత్రలో ప్రభాస్ కి భార్యగా నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ తన నటనతోనే రాజసం ఉట్టిపడేలా నటించింది.

ఇకపోతే ఈ సినిమాలో అనుష్క పాత్రకు డూప్ గా నటించింది ఎవరో తెలుసా.. ఆమె కూడా ఒక హీరోయిన్ చూడడానికి అచ్చం అనుష్కలాగే ఉంటుంది.దూరం నుంచి చూస్తే ఇద్దరు ఒకేలా ఉంటారు అనిపిస్తుంది.అదే కలర్.. అదే హైట్ తో ఇద్దరూ ఉంటారు. ఆమె ఎవరో కాదు రుషిక రాజ్.. 2021 లో వచ్చిన అశ్మీ అనే చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఇక ఈ సినిమాలో ఆమె బోల్డ్ గా నటించి మెప్పించింది.. ఇక అనుష్కకు డూప్ గానే కాదు బ్యాక్ గ్రౌండ్ ఆర్టిస్ట్ గా కూడా కనిపించింది ఈ ముద్దుగుమ్మ. అనుష్క డూప్ గా నటించి తనకంటూ కూడా ఒక గుర్తింపును సొంతం చేసుకుంది.

ఇక అనుష్క విషయానికి వస్తే.. ఈ మధ్యకాలంలో ఎక్కువగా సినిమాలలో కనిపించడం లేదని చెప్పాలి. సోషల్ మీడియాకి కూడా దూరంగా ఉండే ఈమె ఎక్కువగా తన సమయాన్ని కుటుంబానికే కేటాయిస్తోంది. మరోపక్క నవీన్ పోలిశెట్టితో ఒక సినిమాలో నటిస్తోంది. ఇక ఈ సినిమా గురించి ఎటువంటి అప్డేట్ రాకపోవడంతో ఈ సినిమా ఉందా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అప్పుడెప్పుడో అనుష్క పుట్టినరోజు సందర్భంగా ఒక పోస్టర్ను రిలీజ్ చేశారు. ఇక తర్వాత ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదు. మరి దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version