KGF2: ‘కేజీఎఫ్ చాప్టర్2‘ ఎడిటర్ ఈ 20 ఏళ్ల కుర్రాడని మీకు తెలుసా?..అతని కథ ఇదే

-

‘కేజీఎఫ్ చాప్టర్ 1’కు సీక్వెల్ గా తెరకెక్కిన ‘కేజీఎఫ్ 2’ గురువారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. విజయవంతమైన చిత్రంగా ముందుకు సాగుతున్న సినిమా గురించి సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ప్రపంచస్థాయి సినిమాను ప్రశాంత్ నీల్ అందించారని సినీ అభిమానులు పొగిడేస్తు్న్నారు. రాఖీ భాయ్ గా యశ్ నటన ఎక్సలెంట్ గా ఉందని, ‘అధిర’గా సంజయ్ దత్ పాత్ర చాప్టర్ టూ హైలైట్ అని అంటున్నారు.

‘కేజీఎఫ్ 2’పై పాజిటివ్ రిపోర్ట్స్ వస్తున్న నేపథ్యంలో ఈ చిత్రం కోసం బిహైండ్ ద స్క్రీన్ పని చేసిన టెక్నీషియన్స్ గురించిన చర్చ జరుగుతున్నది. హాలీవుడ్ స్థాయి సినిమాని ప్రశంసలు వెల్లువెత్తుతున్న క్రమంలో ఈ పిక్చర్ ఎడిటర్ ఎవరు అనే చర్చ జరుగుతున్నది. సినిమా సక్సెస్ లో ఎడిటర్ కీలకం అని అంటున్నారు. దర్శకుడు సినిమా ద్వారా తన మనసులోని విషయం చెప్పాలనుకుంటాడు. అయితే, అది నిడివి ఎంత ఉండాలి? అనేది డిసైడ్ చేసేది ఎడిటర్.

సినిమా స్టోరిని ఎప్పుడు? ఎంత? ఏ మేరకు చెప్పాలి అనేది ఎడిటర్ డిసైడ్ చేస్తారు. అలా పిక్చర్ సక్సెస్ లేదా ఫెయిల్యూర్ విషయంలో ఎడిటర్ కూడా కీ రోల్ ప్లే చేస్తారు. ‘కేజీఎఫ్ చాప్టర్ 1’కు ప్రశాంత్ నీల్ శ్రీకాంత్ గౌడను ఎడిటర్ గా పెట్టుకున్నారు. కాగా, చాప్టర్ 2 కు మాత్రం 20 ఏళ్ల కుర్రాన్ని పెట్టుకున్నాడు. అవునండీ..మీరు విన్నది నిజమే.

KGF Chapter 2 First Look
KGF Chapter 2 First Look

 

ఇంత భారీ చిత్రాన్ని ఎడిటింగ్ చేసింది పాతికేళ్లు కూడా నిండని వ్యక్తి..అతనే ఉజ్వల్ కులకర్ణి. కొత్త వాళ్లకు అవకాశం ఇవ్వడంలో ప్రశాంత్ నీల్ ఎప్పుడూ ముందుంటాడు. ఈ క్రమంలోనే 20 ఏళ్ల ఉజ్వల్ కులకర్ణికి ‘చాప్టర్ 2 ’ ఎడిటింగ్ బాధ్యతలు ఇచ్చారు. అలా ఈ సినిమాకు మరో హీరో ఉజ్వల్ కులకర్ణి అని చెప్పొచ్చు.

 

Read more RELATED
Recommended to you

Latest news