మహేశ్, ఎన్టీఆర్, బన్నీ మధ్య ఆధిపత్య పోరు!

-

మహేశ్, బన్నీ, ఎన్టీఆర్ మధ్య అంతర్గత పోటీ నెలకొందా? అంటే అవుననే తెలుస్తుంది. డైరెక్టర్ల విషయంలో ఈ ముగ్గురు పోటీపడి మరీ తమవైపు లాగేసుకుంటున్నారు. సక్సెస్ ఫుల్ డైరెక్టర్లను ముందే లైన్ లో పెట్టే క్రమంలో ముగ్గురు హీరోల మధ్య డైరెక్టర్లు నలిగిపోతున్నారు. ఎలాగంటే.. ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమా తర్వాత రాజమౌళితో మూవీ ప్లాన్ చేసినట్టు మహేష్ ప్రకటించాడు. అయితే దానికంటే ముందే త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఓ సినిమా చెయ్యాలని మహేష్ భావిస్తున్నాడు. కాగా ‘ఆర్.ఆర్.ఆర్’ పూర్తయిన తరువాత ఎన్టీఆర్ కూడా త్రివిక్రమ్ డైరెక్షన్లో సినిమా తీయాలని అనుకున్నాడు. ఏమైందో ఏమో గానీ సడెన్ గా కొరటాల శివతో సినిమా చెయ్యబోతున్నట్టు ప్రకటించాడు.

ఇక్కడే అసలు కథ మొదలైంది. ఎందుకంటే కొరటాల శివతో సినిమా చెయ్యబోతున్నట్టు గతేడాదే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రకటించాడు. దాంతో ఈ ముగ్గురు స్టార్ ల మధ్య ఆధిపత్య పోరు మొదలైనట్టు అందరికీ తెలుస్తోంది. ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’ మూవీ చేస్తున్న మహేష్.. ఆ తరువాత అనిల్ రావిపూడితో ఓ సినిమా ప్లాన్ చేసుకున్నాడు. కానీ త్రివిక్రమ్ లైన్ లోకి వచ్చాడు. ఇక్కడే జూనియర్ ఎన్టీఆర్ కు, మహేష్ కు మధ్య పోటీ మొదలైంది. వీరి మధ్య ఎటూ తేల్చుకోలేక త్రివిక్రమ్ ఇబ్బంది పడుతుంటే.. ఎన్టీఆర్ తగ్గి.. కొరటాల శివతో సినిమా చెయ్యడానకి ఫిక్స్ అయ్యాడు.

కానీ ఇక్కడ అనుకోకుండా ఎన్టీఆర్, అల్లు అర్జున్ ల మధ్య ఫైట్ స్టార్ట్ అయింది. ‘పుష్ప’ తరువాత కొరటాల శివతో మూవీ చేద్దామని అల్లు అర్జున్ భావించాడు. ఇప్పుడేమో కొరటాలను ఎన్టీఆర్ లాగేసుకున్నాడు. అటు చూస్తే మహేష్ తో త్రివిక్రమ్ సినిమా ఓకే అయిపోయింది. మరి ఇప్పుడు బన్నీ ఏం చేస్తాడో తేలాల్సి ఉంది. గతంలో అనౌన్స్ చేసినట్టు వేణు శ్రీరామ్ తో ‘ఐకాన్’ ను తిరిగి ప్రారంభిస్తాడా, లేదా చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news