మెగాస్టార్ చిరంజీవి కోస‌మే చేశా : రెజీనా

మెగాస్టార్ చిరంజీవి, స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ కాంబినేష‌న్ లో ఆచార్య సినిమా వ‌స్తున్న విష‌యం తెలిసందే. ఈ సినిమా నుంచి ఇటీవ‌ల సానా క‌ష్టం వ‌చ్చిందే మందాకిని అంటూ సాగే ఈ ఐటెం సాంగ్ విడుద‌ల అయింది. ఈ పాటకు ప్ర‌స్తుతం మంచి రెస్పాన్స్ వ‌స్తుంది. అయితే ఈ పాట‌లో టాలీవుడ్ హీరోయిన్ రెజీనా సానా క‌ష్టం అంటూ చిందు వేసింది. అయితే ఈ ఐటెం సాంగ్ గురించి తాజా గా హీరోయిన్ రెజీనా స్పందించింది. ఈ సానా క‌ష్టం పాట త‌ను చిరంజీవి కోసమే చేశాన‌ని తెలిపారు. ఇంత వ‌ర‌కు అలాంటి ఐటెం సాంగ్ ల‌లో తాను న‌టించ‌లేద‌ని తెలిపింది.

కేవ‌లం మెగాస్టార్ కోస‌మే ఈ ఐటెం సాంగ్ చేయ‌డానికి అంగీకరించిన‌ట్టు తెలిపింది. అయితే త‌న‌కు చిరు డాన్స్ అంటే చాలా ఇష్టం అని కూడా తెలిపింది. అంతే కాకుండా ఆచార్య సినిమా షూటింగ్ కూడా ఈ ఐటెం సాంగ్ తోనే స్టార్ట్ చేశారని తెలిపింది. కేవ‌లం నాలుగు రాత్రుల‌ల్లోనే ఈ ఐటెం సాంగ్ షూటింగ్ పూర్తి అయింద‌ని తెలిపింది. కాగ ఈ సినిమాలో చిరంజీవికి జోడిగా కాజ‌ల్ అగ‌ర్వాల్ నటించింది. అలాగే రామ్ చ‌ర‌ణ్, పూజా హెగ్డే ప్ర‌ధాన పాత్ర‌ల‌లో క‌నిపించ‌నున్నారు. ఈ సినిమాను కొణిదెల ప్రొడ‌క్ష‌న్ తో పాటు మ్యాట్నీ ఎంట‌ర్ టైన్ మెంట్ సంయుక్తం గా నిర్మించాయి. కాగ ఈ సినిమా వ‌చ్చే నెల 4 న విడుద‌ల చేయాల‌ని చిత్ర బృందం ప్లాన్ చేస్తుంది.