Dulquer Salman Birthday: రూ.100కోట్ల బంగ్లా, లగ్జరీ కార్లు.. దుల్కర్ మొత్తం ఆస్తి విలువ ఎంతంటే?

-

‘ఓకే బంగారం’ అంటూ… తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ‘మనసులో నువ్వే ఉన్నావ్ అమ్మాడి’ అంటూ అమ్మాయిల మనసును దోచుకున్నారు. ఇప్పుడు ‘సీతారామం.. యుద్ధం రాసిన ప్రేమ కథ’ అంటూ మన ముందుకు వస్తున్నారు. ఇంటెన్స్‌ లుక్స్… క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్… మెస్మరైజింగ్ యాక్టింగ్​తో అమ్మాయి మనసు దోచిన హీరో దుల్కర్ సల్మాన్. యాక్టర్​, ప్రొడ్యూసర్​, ప్లే బ్యాక్​ సింగర్​గా చిత్రసీమలో తనదైన ముద్ర వేసిన ఆయన.. పుట్టిన రోజు సందర్భంగా ప్రత్యేక కథనం మీకోసం..

దుల్కర్ సల్మాన్ కేరళలోని కొచ్చిలో జూలై 28, 1986 జన్మించారు. మలయాళ స్టార్​ హీరో మమ్ముట్టి తనయుడిగా పరిచయమైన ఆయన వెండితెరపై మలయాళ, తమిళ, తెలుగు భాషల సినిమాల్లో నటిస్తున్నారు.

బాల్యం బస్సుల్లో… దుల్కర్ సల్మాన్ విద్యాభాసం కేరళ, తమిళనాడులో సాగింది. అమెరికాలోని పర్డ్యూ విశ్వవిద్యాలయంలో ఎంబీఏలో డిగ్రీ పట్టా పొందారు. అయితే చిన్నప్పుడు బస్సులోనే స్కూలుకు, సెలవు రోజుల్లోనూ సిటీ బస్సుల్లోనే చెన్నై అంతా తిరిగేవారని గతంలో చెప్పుకొచ్చారు. స్నేహితులతో కలిసి కాఫీ షాపుల్లో కూర్చునేవాడినని గుర్తుచేసుకున్నారు.

పెళ్లితో స్థిరత్వం… సినిమాల్లోకి రాకుముందే చెన్నైకు చెందిన అమల్‌ సూఫియా ఆర్కిటెక్ట్‌ను 2011 డిసెంబరు 22న వివాహం చేసుకున్నారు. పెళ్లితోనే దుల్కర్​కు స్థిరత్వం వస్తుందని.. మమ్ముట్టి తొందరగా పెళ్లి చేశారట. దుల్కర్​కు ఓ పాప ఉంది.

డైరక్టర్​ అవ్వాలనుకుని… చాలా మంది స్టార్ వారసులు చెప్పినట్టే తనకు కూడా నటన అంటే ఇష్టముండదని చెప్పారు. డైరెక్టర్​ అవ్వాలనుకునేవారు. కానీ మమ్ముట్టి కోరిక మేరకు ఓ ఆర్నెల్ల పాటు యాక్టింగ్‌లో శిక్షణ తీసుకుని సినిమాలను ఒప్పుకున్నారు. ఆయన రెండో సినిమా ‘జనతా హోటల్‌’కి ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు రావడంతో సినిమాలపైన ఆసక్తి పెరిగింది.

ఆ సినిమాలంటే భలే ఇష్టం… చిన్నతనంలోనే చెన్నైలో పెరగడం వల్ల దుల్కర్​కు తెలుగు కూడా త్వరగా వచ్చింది. దర్శకుల్లో రాజమౌళికి వీరాభిమాని. ‘మగధీర’, ‘బాహుబలి’, ‘స్వాతికిరణం’ సినిమాలు ఫేవరెట్‌.

కార్లంటే మహా మోజు.. కార్లతోపాటు డ్రైవింగ్‌ కూడా చాలా ఇష్టం. ఒకవేళ హీరో కాకపోయుంటే డ్రైవర్ని అయి ఉండేవాడినని అప్పట్లో చెప్పుకొచ్చారు. కొత్త ఫీచర్లతో వచ్చే కార్లు కొంటుంటారు. మెర్సిడెజ్‌ బెంజ్​ ఎస్​ఎల్​ఎస్​ ఏఎమ్​జీ(2.54 కోట్లు), బీఎమ్​డబ్ల్యూ ఎమ్​ 3(86 లక్షలు), ఫెరారీ 458 స్పైడర్​(4.06కోట్లు), బీఎమ్​డబ్ల్యూ ఎక్స్​6(92.06లక్షలు), మెర్సిడెస్​ బెంజ్ ఏఎమ్​జీ జీ63(2.45కోట్లు), బీఎమ్​డబ్ల్యూ జెడ్​4(78.9 లక్షలు), బీఎమ్​డబ్ల్యూ ఎమ్​ 5(1.62కోట్లు), బీఎమ్​డబ్ల్యూ ఐ8(2.62కోట్లు) ఆయన గ్యారేజీలో ఉన్నాయి.

ఒక్కో సినిమాకు ఎంతంటే.. ఎన్నో కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్​గా వ్యవహరిస్తున్నారాయన. ఒక్కో యాడ్​కు రూ.50 నుంచి రూ.60లక్షల వరకు ఛార్జీ చేస్తారని తెలిసింది. అలాగే ఒక్కో సినిమాకు రెమ్యునరేషన్​ పెంచుతూ వస్తున్నారట. మొదట్లో రూ.2కోట్లు తీసుకునే ఆయన.. ప్రస్తుతం రూ.8కోట్ల వరకు తీసుకుంటున్నారని తెలిసింది.

ఆస్తి విలువ.. ఇంగ్లీష్ వెబ్​సైట్స్​ కథనాలు ప్రకారం ఆయన మొత్తం ఆస్తి విలువ రూ.335కోట్లు. కొచిలో దుల్కర్​కు అత్యంత విలాసవంతమైన దాదాపు రూ.100కోట్లు విలువ చేసే ఇల్లు ఉందట. తన సంపాదనను మిగతా రాష్ట్రాల్లోని రియల్​ ఎస్టేట్​లో ఇన్​వెస్ట్​మెంట్​ చేశారట. దుబాయ్​లో రూ.14కోట్లు విలువ చేసే ఓ పెంట్​ హౌస్​ కూడా ఉందట.

కప్పు కాఫీతోనే మొదలు.. కప్పు కాఫీతోనే దుల్కర్​ రోజు మొదలవుతుంది. తరవాత ఓ గంటపాటు కార్డియో వ్యాయామాలు చేసి మూడు గ్లాసుల వేణ్నీళ్లు తాగుతారు. బ్రేక్‌ఫాస్ట్‌లో ఉడికించిన గుడ్లూ, పండ్లూ, ఓట్స్‌ తీసుకుంటారు. మధ్యాహ్నం కాల్చిన కూరగాయలు, గ్రీన్‌ సలాడ్‌ తింటారు. రాత్రిపూట రోటీతోనే సరిపెట్టుకుంటారు.

Read more RELATED
Recommended to you

Latest news