రేపటి నుండే కామన్వెల్త్ క్రీడలు.. భారత ఫ్లాగ్ బేరర్ గా పీవీ సింధు

-

ప్రతిష్టాత్మక కామన్వెల్త్ క్రీడలు వచ్చేసాయి. బర్నింగ్ హం వేదికగా కామన్వెల్త్ క్రీడలు రేపటి నుండి ప్రారంభం కానున్నాయి. గురువారం కేవలం ఆరంభ వేడుకలు మాత్రమే జరుగుతాయి. ఈ వేడుకలు భారత కాలమానం ప్రకారం రాత్రి 11:30 గంటలకు మొదలవుతాయి. ఆగస్టు 8న ఇవి ముగుస్తాయి. ఈ క్రీడల్లో 72 దేశాలు, 5 వేల మందికి పైగా క్రీడాకారులు పాల్గొననున్నారు. అయితే గాయం కారణంగా భారత పతాకధారీ నీరజ్ చోప్రా ఈవెంట్ నుంచి తప్పుకోవడంతో ఓపెనింగ్ సేర్మనీలో బ్యాట్మెంటన్ స్టార్ పీవీ సింధు భారత ఫ్లాగ్ బేరర్ గా వ్యవహరించనుంది.

ఈ విషయాన్ని ఇండియన్ ఒలంపిక్ అసోసియేషన్ బుధవారం వెల్లడించింది. గత కామన్వెల్త్ గేమ్స్ సింగిల్స్ లో సిల్వర్ మెడల్, మిక్స్డ్ టీం ఈవెంట్లో గోల్డ్ మెడల్ సాధించిన పీవీ సింధు ఈసారి తప్పక గోల్డ్ సాధిస్తుందని అందరూ అంచనా వేస్తున్నారు. కాగా ఈ క్రీడలకు ఇంగ్లాండ్ మూడోసారి ఆతిథ్యం ఇస్తోంది. భారత్ ఒకే ఒక్కసారి (2010) ఈ క్రీడలను నిర్వహించింది.

Read more RELATED
Recommended to you

Latest news