ఈ ఏడాది వచ్చినా రీమేక్ చిత్రాల్లో హిట్లు ఎన్ని.. ఫ్లాఫ్ లెన్ని..

-

ఈ ఏడాది చివరికి వచ్చేసింది.. ఇప్పటివరకు ఎన్నో రీమిక్స్ చిత్రాలు విడుదలయ్యాయి కొన్ని విజయాన్ని సాధిస్తే మరికొన్ని పరాజయం పాలయ్యాయి అయితే ఈ ఏడాది విడుదలైన మొత్తం అన్ని రీమేక్ చిత్రాల్లో హిట్లు ఎన్ని ఉన్నాయి ఫ్లాఫ్ లు ఎన్ని ఉన్నాయో ఒకసారి చూద్దాం..

ఈ ఏడాది స్టార్ హీరోల నుంచి చిన్న హీరోల వరకు ఎందరో రీమేక్ చిత్రాల బాట పట్టారు అయితే ఇందులో ముఖ్యంగా.. తెలుగులో ఈ ఏడాది వచ్చిన రీమేక్స్‌లో మూడు చిత్రాలు మెగా ఫ్యామిలీ నుంచే వచ్చాయి..

అందులో పవన్ కల్యాణ్ భీమ్లా నాయక్ మంచి వసూళ్లను సాధించగా.. చిరంజీవి గాడ్ ఫాదర్, అల్లు శిరీష్ ఊర్వశివో రాక్షసివో చిత్రాలు హిట్ టాక్ సంపాదించుకున్న అంతగా వసూళ్లను రాబట్టలేదు..

అలాగే హీరోయిన్ రెజీనా కసాండ్రా నివేదా థామస్ ప్రధాన పాత్రల్లో నటించిన శాకిని డాకిని కొరియన్ సినిమా మిడ్ నైట్ రన్నర్స్కు రీమేక్. ఇది ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

అలాగే ఈ ఏడాది హీరో రాజశేఖర్ చేసిన శేఖర్ రీమేక్ డీసెంట్ టాక్ను తెచ్చుకుంది.

అలాగే విక్టరీ వెంకటేష్‌కు రీమేక్ రాజా అని పేరుంది. ఈ ఏడాది కూడా ఆయన ఓ రీమేక్‌లో కనిపించారు. విశ్వక్ సేన్ నటించిన ఓరి దేవుడాలో దేవదూత పాత్ర పోషించారు. ఈ సినిమా అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు..

అలాగే నవీన్ చంద్ర హీరోగా నటించిన రిపీట్ ఇటీవల డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలో విడుదలైంది. తమిళ సినిమా డెజావుకు రీమేక్ ఇది.

అలాగే త్వరలో విడుదల కానున్న గుర్తుందా శీతాకాలం కన్నడ హిట్ లవ్ మాక్‌టైల్కు రీమేక్. అయితే ఈ రీమేక్ కథలో మార్పులు చేసినట్లు హీరో సత్యదేవ్ చెప్పారు. ఇందులో తమన్నా, మేఘా ఆకాష్, కావ్యా శెట్టి హీరోయిన్లు గా నటించారు..

Read more RELATED
Recommended to you

Latest news