దేశంలో ప్రతి ఒక్కరి ఇంటిలో ఈ పాప ఫోటో ఉంటుంది.. ప్రస్తుతం బాలీవుడ్ హీరోయిన్ కూడా..

-

నవ్వులు చిందిస్తూ ఈ ఫోటోలో ఉన్న చిన్నారి ప్రస్తుతం పాపులర్ హీరోయిన్.. సినిమాల్లో నటించక ముందే యాడ్స్ తో తెగ పాపులర్ అయింది.. మన దేశంలో దాదాపు ప్రతి ఒక్కరి ఇంటిలో ఈమె ఫోటో ఉంటుంది.. మరి ఈ భామ ఎవరో తెలుసా..

చాలామంది సినిమాల్లోకి రాకముందు యాడ్స్ లో కనిపించే పాపులర్ అయ్యారు.. కొందరి చిన్ననాటి నుంచి యాడ్స్ లో కనిపిస్తూ తెగ క్రేజీ సంపాదించేశారు.. అలాగే ఈ భామ కూడా సినిమాల కంటే ఎక్కువగా యాడ్స్ వల్లే క్రేజ్ సంపాదించుకుంది. పైన ఫోటోలో అచ్చం అమూల్ బేబీలా ఉన్న ఈ ముద్దుగుమ్మ ఎవరో తెలుసా.. అమాయకపు చూపులతో.. చిన్ని చిరునవ్వుతో ముద్దొచ్చేస్తున్న ఈ క్యూటీ.. పలు చిత్రాల్లో నటించి మెప్పించింది.. సినిమాల కంటే యాడ్స్ లోనే ఎక్కువ కనిపించినా ఈమె ఫోటో దాదాపు ప్రతి ఇంట్లో ఉంటుంది.. ఈమె ఎవరో కాదు బాలీవుడ్ హీరోయిన్ యామి గౌతమ్..

బాలీవుడ్ హీరోయిన్ యామీ గౌతమ్.. 1988లో నవంబర్ 28న హిమచల్ ప్రదేశ్ లోని బిలాస్ పూర్ లో జన్మించింది. ఈ అమ్మడు సినిమాల్లోకి రాకముందే ఫేమస్ స్కీన్ బ్రాండ్ ఫెయిర్ అండ్ లవ్లీ ఉత్పత్తి యాడ్ లో తెగ పాపులర్ అయ్యింది. టెలివిజన్ లో యాడ్స్ ద్వారా కెరీర్ ఆరంభించిన యామీ గౌతమ్ ఆ తర్వాత నెమ్మదిగా వెండితెరపై సందడి చేసింది. కన్నడలో ఉల్లాస.. ఉత్సాహ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత హిందీలో ఏక్ నూర్, విక్కీ డోనర్, సనమ్ రే, కాబిల్, సర్కార్ 3 వంటి హిట్ చిత్రాల్లో నటించింది. తెలుగులో పలు సినిమాల్లో నటించింది. నువ్విలా.. గౌరవం.. యుద్ధం.. కొరియర్ బాయ్ కళ్యాణ్ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. అయితే అందం, టాలెంట్ ఉన్నా.. ఈ ముద్దుగుమ్మకు మాత్రం అవకాశాలు రాకపోవతడంతో.. గతేడాది జూన్ 4న డైరెక్టర్ ఆదిత్య ధార్‏ను పెళ్లి చేసుకుంది…

Read more RELATED
Recommended to you

Latest news