కల్వకుంట్ల కుటుంబానికి న్యాయం చేయడమే సామాజిక న్యాయం అనుకుంటున్నారు – ఎంపీ లక్ష్మణ్

-

జ్యోతి రావు పూలే ఆశయ సాధనకు బిజెపి కార్యకర్తలు పని చేస్తున్నారని అన్నారు బిజెపి పార్లమెంటు బోర్డు సభ్యుడు లక్ష్మణ్. చదువు ద్వారానే బడుగులు రానీస్తారని భావించిన వ్యక్తి పూలే అని కొనియాడారు. సామాజిక న్యాయానికి తెరలేపి అభినవ పూలే గా కొనియాడబడుతున్న వ్యక్తి మోడీ అన్నారు. బీసీ ల అభివ్రుది కోసం మోడీ చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారని తెలిపారు.

ఇక్కడ కల్వకుంట్ల కుటుంబానికి న్యాయం చేయడం సామాజిక న్యాయం అని అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఇక్కడ బీసీ ల రిజర్వేషన్లు తగ్గించి ఈ ప్రభుత్వం దగా చేసిందని ఆరోపించారు లక్ష్మణ్. 54 శాతం ఉన్న బీసీ లకు 3 మంత్రి పదవులు.. ఒక్క శాతం కూడా లేని తన వారికి నాలుగు మంత్రి పదవులు ఇచ్చారని మండిపడ్డారు. అణగారిన వర్గాల హక్కుల ను కెసిఆర్ హరిస్తున్నారని ఆరోపించారు. కెసిఆర్ నిరంకుశ, అరాచక పాలన సాగిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబేడ్కర్ రాజ్యాంగాన్ని కెసిఆర్ మార్చాలని అంటున్నాడని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news