ఈ రోజుల్లొ కొద్దిగా ఫేమ్ ఉన్న వారిని టార్గెట్ చేయడం సులభంగా మారింది. వారి ఫొటోస్ మార్ఫింగ్ చేసి అసభ్యంగా మార్చి అశ్లీల వెబ్సైట్లు లో పెట్టడం వ్యాపారం గా మారింది. అవగాహన లేని వారు ఇది నిజమే అని నమ్మి అట్టి వారిపై చెడు అభిప్రాయం ఏర్పరుచుకునే అవకాశం ఉంది. ఇక రీసెంట్ గా హాట్ యాంకర్ అనసూయ పిర్యాదు తో అలాంటి సైబర్ నేరగాన్ని పోలీసులు అరెస్టు చేయడం జరిగింది.
వివరాల్లోకి వెళితే కొంత మంది అనసూయ ఫోటో పెట్టి పూర్తి నగ్నంగా, అర్ధనగ్నంగా మార్చి వివిధ వెబ్సైట్లు లో పెట్టారు.ఇది గమనించిన అనసూయ గతంలో పోలీసుల కు పిర్యాదు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. అతను ఆంధ్రప్రదేశ్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పాసలపూడి గ్రామానికి చెందిన పందిరి రామ వెంకట వీర్రాజు.
తాను నకిలీ ట్విటర్ ఖాతా నుంచి అనేక మంది హీరోయిన్ల ఫొటోలను మార్ఫింగ్ చేసి పోస్టు చేసినట్లు గుర్తించారు. అంతేకాకుండా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, టెలిగ్రామ్ యాప్స్‌లో పలువురు టాలీవుడ్ హీరోయిన్స్ ఫొటోస్ పెట్టి అసభ్యకరమైన పదజాలంతో పోస్టులు షేర్ చేస్తున్నట్లు విచారణ లో కనుగొన్నారు.అతడి కంప్యూటర్ లో, అనసూయ, విష్ణు ప్రియ, రష్మీ, ప్రగతి లతో పాటు రస్మిక, కృతి శెట్టి , శ్రీ లీల వంటి యంగ్ హీరోయిన్ల ఫోటోలు మార్పింగ్ అయి ఉన్నాయని గుర్తించారు. అలాగే చాలా మంది సీరియల్స్ చేసే నటీమణుల, మిడిల్ ఏజ్ ఆంటీ ల ఫోటోలు కూడా ఉన్నాయట. దీని వెనక ఇంకా ఎవరూ ఉన్నారని పోలీసులు చాలా లోతుగా విచారణ జరుపుతున్నారట.