సీరియ‌ల్ కిల్ల‌ర్ గా సుహాస్..”ఫ్యామిలీ డ్రామా” ట్రైలర్ రిలీజ్

కలర్ ఫోటో సినిమాతో…హీరో సుహాస్ ఓ రేంజ్ కు వెళ్ళాడు. సుహాస్ హీరోగా నటించిన ఈ సినిమాను హృదయ కాలేయం సినిమాతో పేరు తెచ్చుకున్న సాయి రాజేష్ నీలం నిర్మించారు. కొత్త దర్శకుడు సందీప్ రాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాతో సుహాస్ తో పాటు హీరోయిన్ చాందిని చౌదరి కి మంచి అవకాశాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో హీరో సుహాస్.. తాజా మరో సినిమాతో వచ్చేశాడు.

హీరో సుహాస్ నటించిన “ఫ్యామిలీ డ్రామా” అనే సినిమా ట్రైలర్ ను ఇవాళ విడుదల చేసింది చిత్రబృందం. ఇప్పటికే ఈ మూవీ పోస్టర్లు జనాల్లో ఆసక్తిని కలిగించగా.. తాజాగా ఇవాళ రిలీజ్ అయిన ట్రైలర్ ప్రేక్షకులను మరో రేంజ్ కు తీసుకు వెళ్లింది. ఈ మూవీలో సుహాస్ సీరియస్ కిల్లర్ గా నటిస్తుండటం దీనికి కారణం.

మెహర్ తేజ్ డైరెక్షన్ సిల్క్స్, సుహాస్ ఫర్ఫార్మెన్స్, అజయ్ అండ్ సంజయ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఈ ట్రైలర్ ను హైప్ కు తీసుకెళ్లాయి. ఇక ఈ రైమ్ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే ను మెహర్ తేజ్, షణ్ముఖ ప్రశాంత్ అందిస్తున్నారు. ఇక ఈ సినిమాలో తేజ కాసారపు, పూజ కిరణ్, అనూష నూతుల, శృతి మెహర్, ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కానుంది.