విశాల్ తో పెళ్లి పై క్లారిటీ ఇచ్చిన ప్రముఖ నటి అభినయ.. ఏమన్నారంటే..?

-

ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ తన సినిమాలను తమిళ్ తో పాటు తెలుగులో కూడా రిలీజ్ చేసి మంచి పాపులారిటీ దక్కించుకున్న విషయం తెలిసిందే. చివరిగా ఆయన లాఠీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి పాజిటివ్ సొంతం చేసుకున్నారు. ఇప్పుడు తాజాగా మార్క్ ఆంటోనీ అనే ఇంట్రెస్టింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు విశాల్. ఇదిలా ఉండగా విశాల్ వయసు 30 సంవత్సరాలు దాటినా ఇంకా ఆయన పెళ్లి చేసుకోలేదు. దీంతో ఆయన పెళ్లికి సంబంధించిన రూమర్స్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గానే మారుతూ ఉంటాయి.

అయితే గతంలో స్టార్ యాక్టర్ వరలక్ష్మి శరత్ కుమార్ తో విశాల్ ప్రేమలో ఉన్నారని, పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అంటూ వార్తలు వచ్చాయి. ఆ తర్వాత శరత్ కుమార్ తో విశాల్ కి గొడవలు వల్లే ఈ పెళ్లి ఆగిపోయింది అని కూడా రూమర్స్ సృష్టించారు. మరి అందులో వాస్తవం లేదని తేలిపోయింది. ఆ తర్వాత హైదరాబాద్కు చెందిన అనీషా రెడ్డితో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు అయితే అది పెళ్లి వరకు వెళ్లలేదు. ఇప్పుడు ఒక తమిళ నటితో విశాల్ పెళ్లి అంటూ ప్రచారం జరగగా.. స్వయంగా విశాల్ ఈ విషయంపై స్పందించి వాస్తవం లేదు అని, దయచేసి రూమర్స్ నమ్మవద్దు అంటూ వెల్లడించారు.

అయితే ఇంతలోనే మరొక నటితో విశాల్ పెళ్లి అంటూ సరికొత్త పుకారు పుట్టుకొచ్చింది. ఆమె మరెవరో కాదు ప్రముఖ నటి అభినయ. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, శంభో శివ శంభో వంటి సినిమాలలో నటించి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన అభినయ ఇప్పుడు విశాల్ తో కలిసి నటిస్తోంది. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా.. తన మనసులో భావాలను వ్యక్తపరిచింది. విశాల్ అంటే చాలా ఇష్టమని, ఆయనకు వీరాభిమానిని అని, ప్రేమ చదరంగం సినిమా చూసిన దగ్గర్నుంచి ఆయనకు అభిమాని అయిపోయాను అని ఆమె తెలిపింది. అయితే తనకు విశాల్ కు పెళ్లి అంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని అది కేవలం రూమర్ మాత్రమే అని తెలుస్తుంది. ఇక మార్క్ ఆంటోనీ సినిమాలో విశాల్ తో కలిసి నటించడం చాలా సంతోషంగా ఉంది, నా అభిమాన నటుడితో నటించడం ఎప్పటికీ మర్చిపోలేను అంటూ తెలిపింది.

 

View this post on Instagram

 

A post shared by M.g Abhinaya (@abhinaya_official)

Read more RELATED
Recommended to you

Latest news