బాలీవుడ్ స్టార్ హీరోయిన్​కు ప్రపోజ్ చేసిన ఫ్యాన్.. వీడియో వైరల్

-

శ్రద్ధా కపూర్.. ఈ యంగ్ బ్యూటీ అటు బాలీవుడ్​లో.. ఇటు టాలీవుడ్​లో మంచి ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్. ఈ భామ తన సినిమాలతోనే కాదు.. తన యాటిట్యూట్​తో చాలా ఫేమస్. డౌన్ టు ఎర్త్​కు పర్ఫెక్ట్ ఉదాహరణ ఈ బ్యూటీ. ఇక శ్రద్ధ తన ఫ్యాన్స్​తో ఇట్టే కలిసిపోయే తత్వం చూస్తే భలే ముచ్చటేస్తుంది ఎవరికైనా. అందుకే శ్రద్ధాకు చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ల వరకు ఫ్యాన్స్ ఉన్నారు. ఇక తాజాగా ఓ ఫ్యాన్​ చేసిన పని చూసి శ్రద్ధ భలే సిగ్గు పడింది. ఇంతకీ అతనేం చేశాడంటే..?

తాజాగా ముంబయి ఎయిర్‌పోర్టులో శ్రద్ధాకపూర్‌ను చూసిన ఓ అభిమాని.. మోకాళ్ల పై నిల్చొని పూల బొకే అందిస్తూ ఐ లవ్యూ శ్రద్ధా అంటూ ప్రపోజ్ చేశాడు. తన అభిమాని చేసిన పని చూసి శ్రద్ధా ఫిదా అయింది. ఆ తర్వాత అతడికి షేక్ హ్యాండ్ ఇచ్చి.. ఓ సెల్ఫీ దిగింది. అయితే ఇప్పుడు ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version