ఉక్రెయిన్ పొట్టకొడుతున్న రష్యా.. ఆహార ధాన్యాలే లక్ష్యంగా దాడులు

-

ఏడాదికి పైగా ఉక్రెయిన్​పై రష్యా భీకర యుద్దం చేస్తూనే ఉంది. ఈ యుద్ధంలో భాగంగా ఇప్పటికే ఉక్రెయిన్​లోని పలు భూభాగాలను కూడా సొంతం చేసుకుంది. అయితే తాజాగా రష్యా కాస్త వెనకడుగేసినట్లు కనిపించింది. ఇటీవలే ఉక్రెయిన్ అధ్యక్షుడు యుద్ధం రష్యావైపునుకు మళ్లిందని చేసిన వ్యాఖ్యలు కూడా దీనికి ఊతమిచ్చారు. మరోవైపు వరుసగా మాస్కోపై ఉక్రెయిన్ డ్రోన్ దాడులు దీన్ని మరింత బలపరిచాయి.

కానీ తాజాగా రష్యా చేస్తున్న దాడులు చూస్తుంటే ఇప్పట్లో యుద్ధం ఉక్రెయిన్​ వైపును వీడేలా లేదని స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ధాన్య ఒప్పందం నుంచి వైదొలగినప్పటి నుంచి ఉక్రెయిన్‌ నౌకాశ్రయాలనే లక్ష్యంగా చేసుకున్న రష్యా బుధవారం కూడా.. ఆ దాడులను కొనసాగించింది. ఇతర దేశాలకు వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేసే అవకాశమున్న ఉక్రెయిన్‌ ప్రత్యామ్నాయ దారులపై.. డ్రోన్ల, క్షిపణుల వర్షాన్ని కురిపించింది. ఉక్రెయిన్‌ -రొమేనియా సరిహద్దులోని ఇజ్మాయెల్‌ దగ్గర డాన్యూబ్‌ నదిపై ఉన్న నౌకాశ్రయాన్ని డ్రోన్లు ప్రయోగించి.. చాలా మేరకు నష్టం కలిగించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version