సూర్య కి షాకిచ్చిన ఫ్యాన్స్ ..ఇదే జరిగితే సూర్య కి కష్టమే …!

-

కోలీవుడ్ స్టార్ హీరో కి గత కొంతకాలంగా హిట్స్ దక్కడం లేదు. వరసగా సినిమాలైతే చేస్తున్నారు గాని ..ఆ సినిమాలు ఫ్లాప్ అవుతూనే ఉన్నాయి. వాస్తవంగా ఒకప్పుడు సూర్య కి కోలీవుడ్ లో విపరీతమైన క్రేజ్ ఉంది. ఆయన నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీగా వసూళ్ళు సాధించాయి. అందుకే కోలీవుడ్ లో హైయ్యెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకున్న హీరోగా సూర్య కి క్రేజ్ ఉంది. కాని ఇప్పుడది కాస్త తగ్గిపోయింది. ఈ రేస్ లో ముందు సూపర్ స్టార్ రజనీకాంత్ ఆ తర్వాత విజయ్ ఉన్నారు.

 

ఇక ప్రస్తుతం సూర్య నటించిన సినిమా రిలీజ్ కి సిద్దంగా ఉంది. కరోనా కారణంగా ఎప్పుడు రిలీజ్ చేస్తారన్నది అయోమయంగా ఉంది. ఇదిలా ఉంటే సూర్య వైఫ్, హీరోయిన్ జ్యోతిక ప్రధాన పాత్రలో సూర్య నిర్మించిన తాజా చిత్రం “పొన్మగల్ వంధాల్”. లాక్ డౌన్ కారణంగా థియేటర్స్ బంద్ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ సినిమాను డైరెక్ట్ గా అమేజాన్ ప్రైమ్‌లో విడుదల చేయాలని సూర్య భావించారు. అది కూడా ఫ్యాన్స్ ని దృష్ఠిలో పెట్టుకే. ఇక్కడ మరో లాజిక్ కూడా ఉంది.

ఒకవేళ ఈ సినిమాకి గనక అమెజాన్ ప్రైమ్ లో మంచి రేటింగ్ వచ్చి ప్రేక్షకులు ఆసక్తికరంగా ఉంటే మాత్రం తన సినిమాని ఇలాగే రిలీజ్ చేయాలనుకుంటున్నారు. అందుకే ముందుగా అమెజాన్ ప్రైమ్ తో ఓ ఒప్పందం కుదుర్చుకున్నారట. ఐతే సూర్య నిర్ణయాన్ని తమిళనాడు థియేటర్స్ యాజమాన్య సంఘం ప్రతినిధులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారట. అలాగే సూర్యను హెచ్చరిస్తూ తమిళనాడు థియేటర్స్ యాజమాన్య సంఘం ప్రధాన కార్యదర్శి పన్నీర్ సెల్వం సూచనాప్రాయంగా తెలిపారట.

సినిమాలను పూర్తిగా థియేటర్లను దృష్టిలో ఉంచుకునే తెరకెక్కిస్తారు. సూర్య నిర్మించిన “పొన్మగల్ వంధాల్” డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదల కావడాన్ని మేం వ్యతిరేకిస్తున్నాం. ఓటీటీలో విడుదల చేయాలనే నిర్ణయాన్ని సూర్య వెనక్కి తీసుకోవాలి. లేకపోతే సూర్య నటించిన, నిర్మించిన సినిమాలను నిషేధిస్తాం అంటూ హెచ్చరించారట. ఈ నేపథ్యంలోనే పన్నీర్ సెల్వం సూర్య సినిమాలను థియేటర్లలో విడుదల కానివ్వమని పేర్కొన్నారు. ఓటిటి ప్లాట్ ఫార్మ్స్ లో సినిమాలు రిలిజ్ చేస్తే థియేటర్స్ కి రానున్న రోజుల్లో తీవ్ర నష్టం వాటిల్లుతుందన్న నేపథ్యంలో ఇలా వాపోతున్నారట.

Read more RELATED
Recommended to you

Latest news