మంచు వారి టైటిల్.. ‘ఫసాక్’

-

కొన్ని పదాలు ఎలా పుడతాయో సందర్భాన్ని బట్టి అనేసినా అవి ట్రెండ్ అవడం వల్ల కొన్ని చోట్ల వాడాల్సి వస్తుంది. ఇలా సినిమాల్లో కొన్ని అర్ధం లేని పదాలు సృష్టించడం కామనే కాని.. ఇటీవల కలక్షన్స్ కింగ్ మోహన్ బాబు ఓ ఇంటర్వ్యూలో ఫసాక్ అనేయడం అది కాస్త ట్రెండ్ అయ్యి హాట్ న్యూస్ గా మారడం జరిగింది.

అయితే ఇలా ట్రెండ్ అయిన ఈ ఫసాక్ అనేదాన్నే టైటిల్ గా పెట్టి సినిమా చేస్తున్నారు మంచు ఫ్యామిలీ హీరో విష్ణు. మంచు విష్ణు హీరోగా ఈ సినిమా ఉంటుందని తెలుస్తుంది. అతని నిర్మాణ సంస్థ 24 క్రాఫ్ట్స్ ఫిల్మ్ ఫ్యాక్టరీ ఖాతాలో ఫసాక్ టైటిల్ రిజిస్టర్ చేయించారట. త్వరలోనే ఈ సినిమా గురించి అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ ఉంటుందని తెలుస్తుంది.

మంచు విష్ణు వోటర్ సినిమా పూర్తయినా రిలీజ్ కు నోచుకోలేదు. కొన్నాళ్లుగా సరైన సక్సెస్ లు లేని మంచు విష్ణు ఈ ఫసాక్ తో అయినా హిట్ కొడతాడేమో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version