నగ్నంగా బీచ్ లో నటుడి పరుగులు.. కేసు నమోదు !

-

గోవాలోని ఒక డ్యాం వద్ద అసభ్య రీతిలో చిత్రీకరణ జరిగిందని చెబుతూ బాలీవుడ్ నటి అనన్య పాండే మీద కేసు నమోదు చేయడమే గాక ఆమెను అరెస్టు కూడా చేసిన సంగతి తెలిసిందే. ఆమె దెబ్బకి గతంలో అలా చేసిన వాళ్ళ అందరి మీద కూడా కేసులు నమోదవుతున్నాయి. అలానే ఇప్పుడు అలా ఎవరు చేస్తున్నా వారినీ వదలడం లేదు. తాజాగా మరో నటుడు మిలింద్ సోమన్ మీద కేసు నమోదైంది. మొన్న బుధవారం నాడు మిలింద్ సోమన్.

పుట్టిన రోజు ఆ రోజున ఆయన బీచ్ లో బట్టల్లేకుండా పరిగెడుతున్న ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. యాబై ఐదు స్టిల్ రన్నింగ్ అని చెబుతూ ఆ ఫోటో షేర్ చేశాడు. అది కూడా గోవా బీచ్ ఏ కావడంతో తో గోవా పోలీసులు కేసు నమోదు చేశారు. గోవా లోని కోల్వా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈయన మీద ఐపీసీ సెక్షన్ 294 అలాగే ఐటి యాక్ట్ సెక్షన్ 27 కింద కేసులు నమోదయ్యాయి. ఇక 55 ఏళ్ల మిలింద్ సోమన్ తన కంటే వయసులో చాలా చిన్న ఆమె అయిన అంకిత కొంవార్ ని పెళ్లి చేసుకున్నాడు. మిలింద్ సోమన్ వయస్సు 55 ఏళ్లుగా గా అంకిత వయసు 29 ఏళ్లు.

Read more RELATED
Recommended to you

Latest news