ప్రభాస్ ఒక్క రూపాయి ఇవ్వలేదు.. అది ఫేక్ కాల్: ఫిష్ వెంకట్ కుమార్తె

-

ప్రభాస్ ఆర్థిక సాయం చేయడంపై ఫిష్ వెంకట్ కుమార్తె షాకింగ్ కామెంట్స్ చేసారు. ప్రభాస్ ఆర్థిక సాయం చేయలేదు.. అది ఫేక్ కాల్ అని క్లారిటీ ఇచ్చారు ఫిష్ వెంకట్ కుమార్తె. రెండు కిడ్నీలు పాడై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు నటుడు ఫిష్ వెంకట్. ప్రభాస్ రూ.50 లక్షలు ఆర్థిక సాయం అందిస్తున్నట్లు కుటుంబ సభ్యులకు ఫోన్ కాల్ వచ్చింది. ప్రభాస్ పీఏ మాట్లాడుతున్నట్లు చెప్పాడు ఓ వ్యక్తి.

fish venkat
fish venkat

అయితే తిరిగి ఆ నెంబర్ కు కాల్ చేస్తే నో రెస్పాన్స్ అని ఫిష్ వెంకట్ కుమార్తె షాకింగ్ కామెంట్స్ చేసారు. ఇలాంటి ఫేక్ కాల్స్ చేయొద్దని ఆవేదన వ్యక్తం చేసిన ఫిష్ వెంకట్ కుమార్తె… మా నాన్న ఫిష్ వెంకట్ గురించి వివరాలు తెలుసుకొని సాయం చేస్తా అన్నారు కానీ, ఇప్పటి వరకు వారి నుంచి ఎలాంటి సాయం అందలేదని వెల్లడించారు. ఇలా ఫేక్ కాల్స్‌తో కాలయాపన చేయకుండా నిజంగా సాయం చేసేవాళ్లు ఎవరైనా ఉంటే సాయం చేయండి అంటూ వేడుకున్నారు ఫిష్ వెంకట్ కూతురు.

Read more RELATED
Recommended to you

Latest news