సింహాద్రి అప్పన్న సన్నిధికి వెళ్లే వారికి బిగ్ అలర్ట్. సింహాద్రి అప్పన్న లో భక్తులకు పెను ప్రమాదమే తప్పింది. సింహాద్రి అప్పన్న సన్నిధిలో తొలి పావంచ వద్ద రేకుల షెడ్డు కుప్ప కూలింది. బరువు విపరీతంగా పెరగడంతో రేకుల షెడ్డు కూలినట్లు తెలుస్తోంది.

అయితే ఆ రేకుల షెడ్డు కుప్పకూలిన నేపథ్యంలో ఆ ప్రమాద సమయంలో ఎవరు లేరు. దీంతో భక్తులు ఎవరికీ కూడా ప్రమాదం జరగలేదు. ఇటీవల సింహాద్రి అప్పన్న సన్నిధిలో గోడకులగా ఇప్పుడు షెడ్డు కూడా కూలింది. దీంతో అక్కడి భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక అటు సింహాద్రి అప్పన్న సన్నిధిలో రేకుల షెడ్డు కోరడంపై అధికారులు.. ఆరా తీస్తున్నారు. కాగా ఇటీవలే సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో గోడ కూలి 7 గురు భక్తులు మృతి చెందారు. సింహాద్రి అప్పన్న స్వామివారి నిజరూపాన్ని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులపై గోడ కూలడంతో 7 గురు మృతి చెందారు.
సింహాద్రి అప్పన్న భక్తులకు తప్పిన ప్రమాదం..
తొలిపావాంచా వద్ద కూలిన రేకుల షెడ్డు
బరువు ఎక్కువై కూలిన షెడ్డు
ప్రమాద సమయంలో ఎవరూ లేకపోవడంతో తప్పిన ప్రమాదం
మొన్న గోడ, ఇప్పుడు షెడ్డు కూలడంతో భక్తుల ఆందోళన pic.twitter.com/HIfnXoPKYK
— BIG TV Breaking News (@bigtvtelugu) July 5, 2025