రీసర్వే పూర్తయిన గ్రామాలలో ఆగస్టు నెల నాటికి రైతులకు కొత్త పాస్ పుస్తకాలను అందించాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రతి పాస్ బుక్ పైన క్యూఆర్ కోడ్ తో పాటు ఆధార్ ఆధారంగా తమ సొంత భూమి వివరాలను తెలుసుకునే విధంగా చర్యలు చేపట్టారు. 2027 డిసెంబర్ నాటికి భూముల రీసర్వే పూర్తిచేయాలని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.

అలాగే అక్టోబర్ నాటికి ప్రతి ఒక్కరికి శాశ్వత కుల ధ్రువీకరణ పత్రాలు పంపిణీ చేయాలని సూచనలు జారీ చేశారు. ఇదిలా ఉండగా…. ఏపీలో ప్రభుత్వ డిగ్రీ, పాలిటెక్నిక్, జూనియర్ కాలేజీలలో లెక్చరర్ పోస్టుల భర్తీకి కూటమి ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. టీటీడీ కళాశాలలో రాత పరీక్ష తేదీలను వాయిదా వేస్తున్నట్లుగా తెలిపారు. మిగతా పరీక్షలు ఈనెల లోనే జరుగుతాయని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో పరీక్షలు రాసే నిరుద్యోగులు సిద్ధమవుతున్నారు.