రామ్ చరణ్ పై ఫ్రెంచ్ హీరో ప్రశంసలు

-

ఆర్ఆర్ఆర్ సినిమాతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందాడు. గ్లోబల్ స్టార్ డమ్ దక్కించుకున్నాడు. ప్రపంచ సినీ ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకున్నాడు. ప్రేక్షకులే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పలువురు సినీ ప్రముఖులు కూడా రామ్ చరణ్ నటనపై ప్రశంసలు కురిపించారు. తాజాగా ఈ జాబితాలో ఫ్రెంచ్ నటుడు చేరాడు.

 రామ్​చరణ్​ నటనపై ఫ్రెంచ్ నటుడు లుకస్ బ్రావో ప్రశంసలు కురిపించాడు. ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్​చరణ్ పాత్ర అద్భుతంగా ఉందని తాజాగా ఓ ఇంటర్వ్యూలో అన్నాడు. ‘మీరు ఇష్టపడే ఇండియన్ మూవీ లేదా ఇండియన్ నటుడు ఎవరు’ యాంకర్ అడగడంతో లుకాస్ రామ్ చరణ్ పేరు చెప్పుకొచ్చాడు.  ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో హీరో రామ్‌చరణ్‌ నటన అద్భుతమని కొనియాడాడు. ఎంట్రీ సీన్‌, ఎమోషనల్‌ సన్నివేశాల్లో బాగా నటించాడని చెప్పుకొచ్చాడు. యాక్షన్‌ సీక్వెన్స్‌లలోనూ ఆకట్టుకున్నాడని బ్రావో రామ్ చరణ్ పై ప్రశంసలు కురిపించాడు.

Read more RELATED
Recommended to you

Latest news