మా కష్టాన్ని ఎన్నిసార్లు..మీ ఖాతాలో వేసుకుంటారు అంటూ సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ సెటైర్లు వేశారు. ముఖ్యమంత్రి గారు..మొన్న… 30 వేల ఉద్యోగాలు మీరే ఇచ్చారన్నారు…నిన్న… కాగ్నిజెంట్ కంపెనీని మీరే తెచ్చామన్నారని ఆగ్రహించారు. నేడు…సీతారామ ప్రాజెక్టును మీరే కట్టారంటున్నారు….మా కష్టాన్ని ఎన్నిసార్లు.. మీ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తారని ఫైర్ అయ్యారు.
హద్దుమీరిన అబద్ధాలతో..ఇంకా ఎన్నిసార్లు మభ్యపెట్టాలని చూస్తారని ఆగ్రహించారు. మీరు శ్రీకారం చుట్టి.. మీరే లక్ష్యాన్ని చేర్చిన నాడు..అది మీ సమర్థతకు ప్రతీక అవుతుందన్నారు కేటీఆర్. అంతే తప్ప..బీఆర్ఎస్ సర్కారు క్రెడిట్ ను.. కొట్టేసే ప్రయత్నం మీరు ఎంత చేసినా..నాలుగు కోట్ల ప్రజానీకం మాత్రం నమ్మదని అంటూ ఫైర్ అయ్యారు కేటీఆర్. తెలంగాణ సమాజం ఎప్పటికీ విశ్వసించదని తెలిపారు కేటీఆర్.