ఆ బడా ఫ్యామిలీ నుంచి.. హీరో గా ఎదుగుతున్న సమయంలో మరణించిన హీరో..!!

-

సీనియర్ ఎన్టీఆర్ కు సినీ ఇండస్ట్రీలో ఎంత గొప్ప పేరు ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. తన నటనతో ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేస్తూ ఎన్టీఆర్ సినీ ఇండస్ట్రీలో ఎదురులేని నాయకుడు గా ఎదిగారు. ఎన్నో పౌరాణిక చిత్రాలలో నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించారు. ఎన్టీఆర్ గురించి ఎంత చెప్పినా తక్కువే అని చెప్పవచ్చు. ఆయన భౌతికంగా ప్రేక్షకుల మధ్య లేకపోయినా కూడా ఆయన నటించిన సినిమాలు మాత్రం నిత్యం అభిమానులకు, ప్రేక్షకులకు గుండెల్లో ఉంటాయని చెప్పవచ్చు.అటు సినీ ఇండస్ట్రీలో ఇటు రాజకీయ వైపు కూడా ఎదురులేని నాయకుడు గా పేరుపొందాడు. ఎన్టీఆర్ నట వారసుడిగా బాలకృష్ణ, హరికృష్ణ వంటివారు ఎంట్రీ ఇచ్చి బాగానే పేరు తెచ్చుకున్న వీరి కుమారులు, ఎన్టీఆర్ మనవళ్ళు చైతన్య కృష్ణ, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, తారకరత్న వంటివారు నటులుగా ఇండస్ర్టీలోకి ఎంట్రీ ఇచ్చారు. అందరికీ తెలియని విషయం ఏమిటంటే ఎన్టీఆర్ కు మరొక సోదరుడు కూడా ఉన్నాడనే విషయం తెలియదు. ఈయన కూడా కెరియర్ మొదట్లో పలు సినిమాలలో నటించారు అన్న సంగతి చాలా మందికి తెలియక పోవచ్చు.

సీనియర్ ఎన్టీఆర్ తమ్ముడు త్రివిక్రమరావు కూడా సినీ పరిశ్రమలో నిర్మాతగా ఉండేవారు. ఆయన ఇద్దరు కుమారులు కూడా కళ్యాణ్ చక్రవర్తి ,హరిన్ చక్రవర్తి ఉండేవారు. ఇందులో కళ్యాణ్ చక్రవర్తి సినీ ఇండస్ట్రీలో మంచి నటుడిగా పేరు సంపాదించారు. ఇక ఈయన సోదరుడు హరీన్ చక్రవర్తి కూడా ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకోవాలన్న ఆలోచనతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు కానీ అనుకోని రోడ్డు ప్రమాదం చేత ఆయన మరణించారు. ఈయన నటించిన సినిమాలు మనుషుల్లో దేవుడు సినిమాతో బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చారు ఆ తర్వాత “మామకోడలు సవాల్” సినిమా త యాక్టర్ గా ఎంట్రీ ఇచ్చారు ఆ తర్వాత కూడా పలు సినిమాలలో నటిస్తూ ఉండగా ప్రాణాలను కోల్పోవడం జరిగింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version