ఫుల్ బిజీగా మ‌హేశ్‌బాబు.. వెయిటింగ్ లిస్టులో ప‌డ్డ పూరి జ‌గ‌న్నాథ్‌

-

ఒక‌ప్పుడు స్లోగా సినిమాలు లైన్‌లో పెడుతూ.. చాలా జాగ్ర‌త్త‌గా ఒక‌టికి రెండు సార్లు ఆలోచించికుని మ‌రీ ఓకే చెప్పేవాడు సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ బాబు. ఆయ‌న కోసం డైరెక్ట‌ర్ల క్యూ క‌డుతున్నా ఆయ‌న మాత్రం చాలా నెమ్మ‌దిగానే సినిమాలు చేసేవాడు. ఇప్పుడు ప్ర‌స్తుతం టాలీవుడ్ హీరోలు వ‌రుస బెట్టి సినిమాల‌ను లైన్‌లో పెడుతున్నారు.

దీంతో తానెందుకు త‌గ్గాల‌నుకున్నాడో ఏమో గానీ మ‌హేశ్ కూడా స్టార్ డైరెక్ట‌ర్ల‌ను ముందే బుక్ చేస్తున్నాడు. దీంతో ఆయ‌న‌కు స్టార్‌డ‌మ్ ఇచ్చిన ఓ డైరెక్ట‌ర్ ఇప్పుడు వెయిటింగ్ లిస్టులో ప‌డ్డాడు. మ‌రి మ‌హేశ్ ఎందుకు అత‌డిని వెయిటింగ్‌లో పెట్టాడంటే ఆయ‌న‌కు ఉన్న క‌మిట్ మెంట్స్ కార‌ణం.

మ‌హేశ్‌తో సినిమా చేసేందుకు పూరి జ‌గన్నాథ్ ఓ క‌థ‌ను కూడా వినిపించాడు. దీనికి ఓకే చెప్పిన మ‌హేశ్ కొన్నాళ్లు టైమ్ అడిగాడు. ఎందుకంటే ఇప్పుడు స‌ర్కారువారి పాట‌, దాని త‌ర్వాత రాజ‌మౌళితో సినిమా ఉంది. ఇక దీని త‌ర్వాత అనిల్ రావిపూడికి అవ‌కాశం ఇచ్చాడు. ఈ మూడు అయిపోయాక చేద్దామ‌ని చెప్ప‌డంతో పూరి వెన‌క్కు త‌గ్గాడంట‌. ఆ క‌థ‌ను వేరే యంగ్ హీరో తో చేయాల‌ని చూస్తున్నాడు. మొత్తానికి పూరికి మ‌హేశ్ కూడా దొర‌క‌ట్లేదు.

Read more RELATED
Recommended to you

Latest news