‘హీరో’గా రానున్న గల్లా అశోక్

-

సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా కథనాయకుడిగా పరిచయంకాబోతున్న చిత్రం ‘హీరో’. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించిన హీరో సంక్రాంతి బరిలో నిలిచింది. హీరో సినిమా యాక్షన్, రోమాంటిక్ ఎంటర్ టైనర్ గా రాబోతుంది. ఈ సినిమా జనవరి 15న థియేటర్లలో విడుదల కానుంది. గల్లా అశోక్ కు మొదటి సినిమా కాగా ఘట్టమనేని, గల్లా ఫ్యామిలీలు దీనిపై భారీ ఆశలనే పెట్టుకున్నాయి.

- Advertisement -

‘హీరో’ సినిమా అంతా నవ్వుతూనే ఉంటారని దర్శకుడు శ్రీరామ్ ఓ ఇంటర్య్వూలో తెలిపారు. అశోక్ నటించడం మొదటిసారే అయినా ఎక్కడా అలా కనిపించలేదు అని చెప్పారు. చిత్రంలో అశోక్ పై కౌబాయ్ సన్నివేశాలను కూడా చిత్రీకరించినట్లు తెలిపారు. సినిమాలోని మొదటి పది నిమిషాలు చచాలా బాగుంటుందని… ఎవరూ మిస్ కావద్దన్నారు. చిత్రంలో కథనాయకుడు హీరో అవ్వాలనే కోరికతో ఉంటాడని అందుకే ఈ సినిమాకి ‘హీరో’ అనే టైటిల్ పెట్టామన్నారు. ఇప్పటికే సినిమాని చూసిన సూపర్ స్టార్ కృష్ణ చాలా బాగా తీశావని మెచ్చుకున్నట్లు చెప్పారు.

కృష్ణ ప్రశంసలతో దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య సగం విజయాన్ని సాధించినట్లేనని ఆనందంలో మునిగి తేలుతున్నారు. ఈ చిత్రానికి సంగీతం ఘిబ్రాన్ అందించారు. ఇప్పటికే విడుదలైన పాటలు మంచి ఆదరణ పొందగా… చిత్రంపై మరిన్ని అంచనాలను పెంచాయి. దర్శకుడు రాజమౌలి చేతుల మీదుగా విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను థియేటర్ కి రప్పించేలా కనిపిస్తుంది. ఈ చిత్రాన్ని అమరా రాజా మీడియా & ఎంటర్ టైన్మెంట్ బ్యానర్లో గల్లా పద్మావతి నిర్మించారు. ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించారు. జగపతిబాబు, నరేష్, వెన్నెల కిషోర్ , బ్రహ్మాజిలు ప్రధాన పాత్రల్లో నటించారు. ఇప్పటికే మూడు విభిన్న కథలను టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం చేసిన శ్రీరామ్ ఆదిత్య హీరో చిత్రంతో కూడా ఆకట్టుకుంటారని చిత్ర వర్గాలు ఆశిస్తున్నాయి. గల్లా అశోక్ “హీరో”గా ఈ నెల 15న థియేటర్లలోకి రానున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...